MI VS CSK: ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ

Chennai Super Kings beat Mumbai Indians by 20 runs
x

MI VS CSK: ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ

Highlights

MI VS CSK: ఈ సీజన్లో రోహిత్ శర్మ వ్యక్తిగతంగా తొలి సెంచరీ

MI VS CSK: ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి మజానిచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తర పోరును తలపించింది. చైన్నై సూపర్ కింగ్స్ 20 పరగుల తేడాతో విజయభేరి మోగించింది. హోరాహోరీగా పోరాడిన ముంబై ఇండియన్స్ పరాజయం బాట పట్టింది. ముంబై మాజీ కెప్టన్ రోహిత్ శర్మ ఒంటరి పోరాటం జట్టును గట్టెక్కించలేకపోయింది. రోహిత్ శర్మ ఈ సీజన్లో వ్యక్తిగతంగా తొలి సెంచరీ నమోదు చేశాడు. 63 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ 11 బౌండరీలు, 5 సిక్సర్లతో 105 పరుగులు నమోదు చేశాడు. ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ల దూకుడుకు కళ్లెం వేసిన చైన్సై సూపర్ కింగ్స్ బౌలర్ మతీష పతిరణ అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు వికెట్లను పడగొట్టాడు. చెన్నై జట్టు విజయంలో కీలక పాత్రపోషించి ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. నిర్ణీత 20 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించలేక 6 వికెట్లను కోల్పోయి 186 పరుగులకే పరిమితమైంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఆటతీరుతో పరుగుల ప్రవాహాన్ని పారించారు. ఇషాన్ కిషన్ మంచి షాట్ కొట్టే ప్రయత్నంలో శార్థుల్ ఠాకూర్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ బాటపట్టాడు. 15 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ 3 బౌండరీలు, ఒక సిక్సర్‌తో 23 పరుగులు అందించాడు.

స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి రాగానే, ఎదుర్కొన్న తొలిబంతిని సిక్సర్‌గా మలిచే ప్రయత్నంలో ముస్తాఫిజుర్ అద్భుతమైన క్యాచ్‌అందుకోవడంతో పెవీలియన్ బాట పట్టాల్సి వచ్చింది. ఆతర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఇద్దరూ కలిసి విజయతీరం చేర్చాలనే ప్రయత్నం చేశారు. మంచి షాట్ కొట్టే ప్రయత్నంలో శార్థుల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

ముంబై ఇండియన్స్ కెప్టన్ హార్థిక్ పాండ్యా రెండు పరుగులకే వెనుదిరిగాడు. ఆతర్వాత వచ్చిన టిమ్ డేవిడ్ పదునైన షాట్లతో రెండు సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఐదు బంతుల్లో రెండు సిక్సర్లతో 13 పరుగులు నమోదు చేశాడు. రొమిరో షెఫర్డ్ ఒకే పరుగుతో వెనుదిరిగాడు. ఆతర్వాత క్రీజులోకి వచ్చిన మహ్మద్ నబీ, రోహిత్ శర్మ కలిసి జట్టు స్కోరును చక్కదిద్దే ప్రయత్నంచేశారు. అయినా కావాల్సిన పరుగులు, మిగిలిన బంతుల అంతరం పెరగడంతో ముంబైజట్టు పరాజయాన్ని చవిచూసింది.

తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టన్ రుతురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో 5 బౌండరీలు, 5 సిక్సర్లతో 69 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. యువబ్యాట్స్ మెన్ శివందుబే 38 బంతుల్లో 10 బౌండరీలు, రెండు సిక్సర్లతో 66 పరుగులు అందించాడు. రచిన్ రవీంద్ర 21 పరుగులు, డేరీ మిచెల్ 17 పరుగులు నమోదు చేశారు.

ఆఖరి ఓవర్లో బ్యాటింగ్ కొచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కళ‌్లు చెదిరే సిక్సర్లతో అభిమానుల్ని అలరించాడు. హ్యాట్రిక్ సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం నాలుగు బంతుల్లో 20 పరుగులు అందించి, జట్టుస్కోరును 206 పరుగులకు చేర్చాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories