సిడ్నీ వేదికగా బరితెగించిన ఆస్ట్రేలియా క్రికెట్ ఫ్యాన్స్

Australia cricket fans abuse words on Indian cricketers
x

భారత్ క్రికెటర్లపై అనుచిత వ్యాఖ్యలు (ఫోటో క్రెడిట్: ఫాక్స్ క్రికెట్)

Highlights

* సిరాజ్‌, బుమ్రాను బండబూతులు తిట్టిన ఫ్యాన్స్ * ఘటనపై బీసీసీఐ ఆగ్రహం * క్షమాపణలు చెప్పిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు

ఆస్ట్రేలియ క్రికెట్ ఫ్యాన్స్ అదే తీరుగా ప్రవర్తించారు. ఎన్నిసార్లు మందలించిన బుద్ది మార్చుకోవడం లేదు. సిడ్ని వేదికగా ఆస్ట్రేలియ ప్రేక్షకులు వక్రబుద్ధీని ప్రదర్శించారు. సిడ్నీ వేదికగా బరితెగించారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో టీమ్‌ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు ఆదివారం మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు ఎదురయ్యాయి. రెండో సెషన్‌లో కామెరాన్ గ్రీన్ క్రీజ్‌లో నిలకడగా ఆడుతున్న సమయంలో.. మహ్మాద్ సిరాజ్ బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నాడు..

అదే సమయంలో స్టాండ్స్‌లోని ప్రేక్షకులు కొంత మంది సిరాజ్‌ను ఉద్దేశించి ఏవో వ్యాఖ్యలు చేశారు. అతడు ఈ విషయాన్ని కెప్టెన్‌కు తెలియజేయడంతో.. రహానె మ్యాచ్ అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. దీంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది.

సిిడ్నీ టెస్టులో టీమిండియా బౌలర్లు మహ్మద్‌ సిరాజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన అభిమానుల్లో కొంతమంది డ్రింక్స్‌ సపోర్టర్స్‌ సిరాజ్‌, బుమ్రాలపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం కాంట్రవర్సీ అయిందిప్పుడు! మూడోరోజు ఆటలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఐతే బౌలర్లపై చేసిన వర్ణ వివక్ష వ్యాఖ్యలు టీమిండియా దృష్టికి రావడంతో కెప్టెన్‌ అజింక్యా రహానే జట్టులోని సీనియర్‌ ఆటగాళ్లైన అశ్విన్‌, రోహిత్‌ శర్మలతో కలిసి ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లతో పాటు మ్యాచ్‌ రిఫరీకి ఫిర్యాదు చేశాడు.

అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల గురించి సీసీ ఫుటేజీ ద్వారా ఆరా తీసి తగిన చర్య తీసుకుంటామని సిడ్నీ క్రికెట్‌ అసోసియేషన్‌ తెలిపింది. సిరాజ్‌, బుమ్రాలపై డ్రింక్‌ సపోర్టర్స్‌ వ్యవహరించిన తీరును తప్పుబట్టిన టీమిండియా ఫిర్యాదుపై... ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. వర్ణ వివక్షను వ్యతిరేకిస్తూ.. 2019 వరల్డ్‌ కప్‌ సాధించిన ఇంగ్లండ్‌ జట్టు గురించి ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. క్రికెట్‌ అంటేనే జెంటిల్‌మెన్‌ గేమ్‌కు పెట్టింది పేరు. తుది జట్టులో 11 మంది ఉంటే.. వారు విభిన్న వ్యక్తిత్వాలు కలిగి ఉంటారు. వైవిధ్యం లేకపోతే క్రికెట్‌ అనే పదానికి అర్థం లేదు. ఇలా వర్ణ వివక్ష వ్యాఖ్యలతో ఆటగాళ్లను మానసికక్షోభకు గురి చేయడం కరెక్ట్‌ కాదు. అంటూ ట్వీట్‌ చేసింది.

సిరాజ్‌, బుమ్రాలపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడంపై సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టీమిండియా ఫ్యాన్స్... సిడ్నీ అభిమానులపై ఫైర్ అవుతున్నారు. సరిగ్గా 13 ఏళ్ల క్రితం ఇదే సిడ్నీ మైదానంలో ఆసీస్‌ మాజీ ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ , టీమిండియా వెటెరన్‌ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ల మధ్య చోటుచేసుకున్న వివాదం అంత తేలిగ్గా ఎవరు మరిచిపోలేరు. అప్పటి టెస్టు మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ​మంకీగేట్‌ వివాదంగా క్రికెట్‌ చరిత్రలో పెను సంచలనం రేపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories