Hanuman Jayanti 2024: హనుమాన్‌ జయంతి రోజు ఈ రాశులవారికి శుభం.. స్వామి అనుగ్రహం పొందుతారు..!

On the Day of Hanuman Jayanti do this puja for these zodiac signs they will get the blessings of Lord
x

Hanuman Jayanti 2024: హనుమాన్‌ జయంతి రోజు ఈ రాశులవారికి శుభం.. స్వామి అనుగ్రహం పొందుతారు..!

Highlights

Hanuman Jayanti 2024:ఈ ఏడాది ఏప్రిల్‌ 23న హనుమాన్‌ జయంతి వస్తుంది. ఈ రోజు హనుమాన్‌ భక్తులకు పెద్ద పండుగ రోజు. ఈ రోజు శ్రీరాముని గొప్ప భక్తుడైన హనుమంతుడి పుట్టిన రోజు.

Hanuman Jayanti 2024: ఈ ఏడాది ఏప్రిల్‌ 23న హనుమాన్‌ జయంతి వస్తుంది. ఈ రోజు హనుమాన్‌ భక్తులకు పెద్ద పండుగ రోజు. ఈ రోజు శ్రీరాముని గొప్ప భక్తుడైన హనుమంతుడి పుట్టిన రోజు. ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమ నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. వాస్తవానికి మంగళవారం, శనివారాలు హనుమంతుడికి అంకితం చేశారు. కాబట్టి హనుమాన్ జయంతి మంగళవారం, శనివారం వచ్చినప్పుడల్లా దాని ప్రాధాన్యం మరింత పెరుగుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఆంజనేయస్వామి అనుగ్రహం పొందాలంటే హనుమాన్ జయంతి రోజు ఏ రాశి వారు ఏం చేయాలో తెలుసుకుందాం.

మేషరాశి, వృశ్చిక రాశి

ఈ రాశుల వారికి కుజుడు అధిపతి . కాబట్టి వీరు ఆంజనేయస్వామిని తమలపాకులతో పూజించాలి. అష్టోత్తర పూజ చేసిన తర్వాత ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది.

వృషభ రాశి, తులా రాశి

ఈ రాశుల వారికి అధిపతి శుక్రుడు. వీరు హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి తులసి మాల, సింధూరాన్ని సమర్పించాలి. షోడశోపచార పూజ చేసిన తర్వాత స్వామికి మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుడి అనుగ్రహం లభిస్తుంది.

మిథున రాశి, కన్యా రాశి

ఈ రాశుల వారికి బుధుడు అధిపతి. హనుమత్ జయంతి రోజున వీరు హనుమాన్ చాలీసా 108 సార్లు చదవాలి. స్వామిని అష్టోత్తరంతో పూజించి హనుమంతుడికి అప్పాల దండను (108) సమర్పిస్తే చాలా మంచిది.

ధనుస్సురాశి, మీనరాశి

ఈ రాశులకు బృహస్పతి అధిపతి. వీరు స్వామికి లవంగాలతో తయారు చేసిన ప్రసాదాన్ని సమర్పించాలి. ఆంజనేయ స్వామి దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల హనుమంతుని అనుగ్రహం పొందుతారు.

మకరరాశి, కుంభ రాశి

ఈ రాశులకు శని అధిపతి. ఈ రాశి వారు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించి, ఆకుపూజ చేయాలి. 108 తమల పాకులతో దండ తయారు స్వామి వారికి సమర్పించాలి. హనుమాన్ చాలీసా 11 సార్లు చదివి అష్టోత్తర నామాలతో పూజ చేయాలి. తర్వాత మోతీచూర్ లడ్డూలను స్వామికి నివేదించాలి.

సింహ రాశి

సూర్యుడు సింహ రాశికి అధిపతి. హనుమంతుని అనుగ్రహం పొందాలంటే హనుమత్ జయంతి రోజున స్వామిని సింధూరంతో పూజించి హనుమాన్ చాలీసాను 11 సార్లు చదవాలి. దీనితో పాటు హనుమాన్ అష్టోత్రాన్ని పఠించాలి. జిలేబీ వంటి తీపి పదార్థాలను స్వామివారికి సమర్చాలి. ఇలా చేయడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్న ప్రతికూల శక్తులు తొలగి ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.

కర్కాటక రాశి

కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. ఈ రాశి వారు హనుమంతుడికి ఆకు పూజ చేయడం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే పాలతో చేసిన తీపి పదార్థాలను స్వామికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శాంతి, సంతోషాలను స్వామివారు కలుగజేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories