Wedding Season: పెళ్లిళ్ల సీజన్‌ వచ్చేసింది.. ఈ విషయాలలో జాగ్రత్త..!

How To Manage Wedding Expenses Follow These Steps For A Cheap And Beautiful Wedding
x

Wedding Season: పెళ్లిళ్ల సీజన్‌ వచ్చేసింది.. ఈ విషయాలలో జాగ్రత్త..!

Highlights

Wedding Season: పెళ్లిళ్ల సీజన్‌ వచ్చేసింది.. హడావిడి మొదలైంది. చాలామంది ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

Wedding Season: పెళ్లిళ్ల సీజన్‌ వచ్చేసింది.. హడావిడి మొదలైంది. చాలామంది ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంటుంది. జీవితంలో ఒక్కసారి చేసుకునే పెళ్లికోసం యువతీ యువకులు చాలా కలలు కంటారు. తన పెళ్లి హుందాగా, లగ్జరీగా చేసుకోవాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎన్ని డబ్బులైనా ఖర్చుచేస్తారు. అవసరమైతే అప్పులు చేసి ఆడంబరాలు చేస్తారు. కానీ పెళ్లి తర్వాత అప్పులు తీర్చలేక చాలా బాధపడుతారు. అందుకే తక్కువ బడ్జెట్‌లో పెళ్లి చేసుకోవడం ఉత్తమం. అది ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం.

ముందుగా బడ్జెట్ వేసుకోండి

పెళ్లికి ముందు బడ్జెట్ సిద్ధం చేసుకోవాలి. బడ్జెట్ లేకుండా వెడ్డింగ్ ఫంక్షన్ నిర్వహిస్తే ఖర్చులు భారీగా ఉంటాయి. మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్‌ సిద్ధం చేసుకోవడం మొదటి పని. వివాహం అలా చేసుకోవాలని ఇలా చేసుకోవాలని చాలా కోరికలు ఉంటాయి. కానీ అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని గుర్తుంచుకోండి. ఉదాహరణకు వివాహానికి బట్టలు, ఆభరణాలు అవసరం. అలాగని ఖరీదైన బట్టలు, ఆభరణాలు అవసరం లేదు. బడ్జెట్‌లో వచ్చే వాటిని తీసుకోవడం ఉత్తమం.

క్యాటరింగ్

పెళ్లి విందులకు డబ్బు గుడ్డిగా ఖర్చు చేస్తారు. చాలా పెళ్లిళ్లలో ఆహారం వృథా అవడం మనం గమనించే ఉంటాం. వివాహ విందు మెనులో అవసరమైన ఆహార పదార్థాలను చేర్చండి. ఉచిత ప్రదర్శన కోసం మెనుని పెంచవద్దు. వివాహానికి హాజరయ్యే వ్యక్తుల సంఖ్యకు అనుగుణంగా క్యాటరింగ్ సిద్దం చేసుకోవాలి. మెనూలో ఎక్కువ వంటకాలను జోడించకుండానే పెళ్లి తంతు ముగించవచ్చు. పెళ్లి ఇంట్లో చాలా అలంకరణ ఉంటుంది. అవసరమైన అలంకరణ వస్తువులు మాత్రమే తీసుకోవాలి. వీటిలో పువ్వులు చాలా ముఖ్యమైనవి. వాటిని చౌకగా ఉన్న ప్రదేశాల నుంచి కొనుగోలు చేయవచ్చు. దీంతో డబ్బు ఆదా అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories