హనుమంత వాహనంపై మలయప్ప స్వామి

హనుమంత వాహనంపై మలయప్ప స్వామి
x
Highlights

తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వేలకొలది భక్తుల మధ్య...

తిరుమలేశుని ఆలయంలో నిత్యకళ్యాణం-పచ్చతోరణమే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి ఏడాది శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను వేలకొలది భక్తుల మధ్య నిర్వహిస్తారు. అదే విధంగా ఈ ఏడాది కూడా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది కరోనా వైరస్ నేపథ్యంలో స్వామివారికి ఏకాంతంగా ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. మొదటి రెండు రోజుల బ్రహోత్సవాల్లో మొదటి రోజు ధ్వజారోహణం, రెండో రోజు శేషవాహనం పైన ఊరేగించారు. అదేవిధంగా మూడో రోజు ఉదయం సింహవాహన సేవ, నాలుగవ రోజు కల్పవృక్ష వాహనంపై ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకున్ని ఊరేగించారు. అదే విధంగా ఐదవ రోజు ఆ మలయప్ప స్వామివరు భక్తులకు మోహిని అవరతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అనంతరం సాయంత్రం వేల స్వామివారు గరుడవాహనంపై ఊరేగారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చి కనువిందు చేసారు. హనుమంతుడు, శ్రీరాముని నమ్మినబంటు. త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తుడిని తాను మర్చిపోలేదంటూ, ఆ బంటుకు మళ్ళీ తన సేవాభాగ్యం కలిగించే దివ్య దృశ్యం ఇది. తాను సైతం ఆ మహావిష్ణువు స్వరూపమేనని భక్తులకు స్వామి తెలియజేసే మధుర సన్నివేశమది. హనుమంతుని స్మరిస్తే ధైర్యం, ఆరోగ్యం, బుద్ది, బలం, యశస్సు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.

Show Full Article
Print Article
Next Story
More Stories