Vastu Rules: వాస్తు ప్రకారం ఈ దిక్కున నీరు నిల్వ ఉండవద్దు.. అనారోగ్యానికి గురవుతారు..!

According To Vastu Water Should Not Be Stored In This Direction There Are Chances Of Getting Sick
x

Vastu Rules: వాస్తు ప్రకారం ఈ దిక్కున నీరు నిల్వ ఉండవద్దు.. అనారోగ్యానికి గురవుతారు..!

Highlights

Vastu Rules: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. ప్రాచీన కాలం నుంచి గొప్ప గొప్ప కట్టడాలను వాస్తు ప్రకారమే నిర్మించారు.

Vastu Rules: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాధాన్యం ఉంది. ప్రాచీన కాలం నుంచి గొప్ప గొప్ప కట్టడాలను వాస్తు ప్రకారమే నిర్మించారు. అందుకే ఇప్పటికీ అవి చెక్కు చెదర కుండా ఉన్నాయి. వాస్తు మానవ జీవితాన్నిప్రభావితం చేస్తుంది. మీరు ఎక్కువ సమయం గడిపే ఇల్లు లేదా పనిచేసే చోటు వాస్తు ప్రకారం ఉండాలని గుర్తుంచుకోండి. ఇక్కడ దిశలు చాలా ప్రాధాన్యం కలిగి ఉంటాయి. వాడుకునే వస్తువులు కానీ నిచ్ఛల స్థితిలో ఉండే వస్తువులు కానీ సరైన దిశలో ఉన్నప్పుడే వాటి నుంచి పాజిటివ్‌ ఫలితాలు వెలువడతాయి. లేదంటే నెగిటివ్‌ ఎనర్జీ ప్రసరించి వాస్తు దోషాలను సృష్టించి నష్టాలను కలిగిస్తాయి.

ప్రతి దిశకు ప్రాముఖ్యత

ప్రతి దిశ దాని సొంత ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఎందుకంటే ఆ దిశను గ్రహం, దాని గురువు, విశ్వం శక్తి ప్రభావితం చేస్తుంది. ఏ దిక్కున ఏం చేస్తే ఎలాంటి లాభం, ఎలాంటి హాని జరుగుతుందో రుషులు, మహర్షులు ప్రాచీన కాలంలోనే చెప్పారు. అందువల్ల నిద్ర లేవడం, భోజనం చేయడం, చదవడం, పూజ చేయడం, వంట చేయడం ఇలా అన్ని పనులు ఏ దిశలో చేయాలో కొన్ని నియమాలను రూపొందించారు.

పాటించకుంటే రోగాలు

వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నిబంధనలను ఉల్లగించినట్లియతే ఆరోగ్యంపై నెగిటివ్‌ ప్రభావం పడుతుంది. ఉదాహరణకు పశ్చిమ దిశలో నీటిని ఉంచడం థైరాయిడ్ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. దక్షిణ, తూర్పు మధ్య కోణీయ ప్రదేశంలో అదనపు నీరు ఉంటే దీనిని మండుతున్న మూల అని పిలుస్తారు. దీనివల్ల మహిళల్లో ల్యుకోరోయో, గర్భాశయానికి సంబంధించిన, సమస్యలు తలెత్తుతాయి.

వంటగది నైరుతి దిశలో ఉంటే ఇంట్లోని వ్యక్తులు అజీర్ణం, కిడ్నీ సంబంధిత వ్యాధులకు గురవుతారు. నైరుతి మూలలో ఉన్న వంటగది నుంచి ఆహారం తీసుకోవడం ఆరోగ్యంపై నెగిటివ్‌ ప్రభావాలను చూపుతుంది. ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతారు. అదేవిధంగా ఆగ్నేయ మూలలో ఎప్పుడూ మెట్లు ఉండకూడదు. లేకుంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు రావచ్చు. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే తమ్ముడికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిశను ఇషాన్ కోన్ అని పిలుస్తారు. ఈ దిశలో వంటగది ఉండటం వల్ల మడమ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories