Hen Lifespan: ఒక కోడి జీవిత కాలంలో ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా..?

How many eggs does a hen lay in her lifetime
x

Hen Lifespan: ఒక కోడి జీవిత కాలంలో ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా..?

Highlights

Hen Lifespan: ఒక కోడి జీవిత కాలంలో ఎన్ని గుడ్లు పెడుతుందో తెలుసా..?

Hen Lifespan: చికెన్, గుడ్లు మీ డైట్‌లో ఉండాలి. గుడ్లలో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, విటమిన్ ఎ, విటమిన్ బి -12, విటమిన్ ఇ అనేక ఇతర పోషకాలు ఉంటాయి. ఆహారంలో గుడ్లు చేర్చడం మీ శరీరానికి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ డైట్‌లో గుడ్లు తప్పక చేర్చాలి. గుడ్లు తినడం వల్ల మెదడు పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. ఇది కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. గుడ్లు తినడం వల్ల శరీరంలోని ఎముకలు బలపడతాయి. అయితే కోడి సంవత్సరానికి ఎన్ని గుడ్లను పెడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..

మాంసం తినే ప్రతి ఒక్కరి ఆహారంలో గుడ్లు ఉంటాయి. చాలా మంది గుడ్లు రుచి చూస్తారు. అయితే ఒక కోడి సంవత్సరంలో ఎన్నిసార్లు గుడ్లు పెడుతుందో చాలామందికి తెలియదు. ఈ సందేహాన్ని పరిష్కరించడానికి పౌల్ట్రీ శాస్త్రవేత్త డా. ఎయు కిడ్వాయి వివరణాత్మక సమాచారం అందించారు. అతని ప్రకారం పౌల్ట్రీ ఫామ్‌లోని కోళ్ళు సంవత్సరంలో 305 నుంచి 310 గుడ్లు పెడతాయి. అంటే పౌల్ట్రీ ఫామ్‌లోని కోడి నెలకు 25 నుంచి 26 గుడ్లు పెడుతుంది. ఈ సంఖ్య ఎక్కువ లేదా తక్కువ కావచ్చు.

పౌల్ట్రీ కోడితో పోలిస్తే నాటుకోడి సంవత్సరానికి 150 నుంచి 200 గుడ్లు మాత్రమే పెడుతుంది. పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్ళు తినే పద్ధతి, కోళ్ళ పెంపకం చేసే పద్ధతి గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని మారుస్తాయి. ఒక కోడి తన జీవితంలో 75-80 వారాల పాటు గుడ్లు పెట్టగలదు. కొన్ని హైబ్రిడ్ కోళ్ళు 100 వారాల వరకు గుడ్లు పెడతాయి. ప్రపంచంలో చాలా కోడి గుడ్లు తింటారు. కనుక భారతదేశంలో చాలా మంది వాణిజ్య పౌల్ట్రీ రైతులను చూస్తాము. పౌల్ట్రీ కోళ్లను పెంచిన తరువాత గుడ్లతో పాటు మాంసాన్ని విక్రయించడం సాధ్యమవుతుంది. కనుక ఈ వ్యాపారంపై ప్రజల ధోరణి పెరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories