Viral Video: టూత్‌పేస్ట్ కాఫీ ఎప్పుడైనా తాగారా..! ఎలా త‌యారు చేస్తారో చూడండి..

Have you Ever Drunk Toothpaste Coffee
x

టూత్ పేస్ట్ కాఫీ (ఇంస్టాగ్రామ్ ఇమేజ్)

Highlights

Viral Video: తాజాగా టూత్‌పేస్ట్ కాఫీతో మండిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది

Viral Video: గ‌త కొన్ని రోజులుగా సోష‌ల్ మీడియాలో వింత ఆహార పోటీలు జ‌రుగుతున్నాయి. అందులో భాగంగా నెటిజ‌న్లు వింత వింత ర‌కాల ఫుడ్ ఐట‌మ్స్‌, జ్యూస్, ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను త‌యార చేసి వాటికి సంబంధించిన వీడియోల‌ను సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫారంల‌లో వ‌దులుతున్నారు. దీంతో ఈ వీడియోలు నెట్టింట్లో వైర‌ల్‌గా మారుతున్నాయి. ఇటీవ‌ల దోస‌ల రెసిపీని చూసి ఉలిక్కిప‌డ్డ జ‌నాలు తాజాగా టూత్‌పేస్ట్ కాఫీతో మండిపోతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది.

ఈ వీడియోలో ఒక వ్యక్తి టూత్‌పేస్ట్‌తో కాఫీ తయారు చేయ‌డం మ‌నం చూడ‌వ‌చ్చు. మొదట మిక్సర్‌లో టూత్‌పేస్ట్‌ను వేసి ఒక ద్ర‌వంలా చేస్తాడు. ఈ ద్ర‌వాన్ని పాల‌లో క‌లుపుతాడు. దీనికి కాఫీ పౌడ‌ర్ జోడిస్తాడు. ప్లేవ‌ర్ కోసం పిప్ప‌ర‌మెంట్ బిళ్ల‌లు ఇందులో క‌లుపుతాడు. అంతే నురుగులు క‌క్కుతున్న కాఫీ రెడీ దీనిని అత‌డు ఎంతో ఇష్టంగా తాగ‌డం మ‌నం వీడియోలో గ‌మ‌నించ‌వ‌చ్చు. అంతేకాదు. ఈ కాఫీ ఎంతో టేస్టీగా ఉంద‌ని చెప్ప‌డం మ‌రో విశేషం.

అయితే ఈ వీడియో చూసిన నెటిజ‌న్లు ఆ వ్యక్తి జుగుప్సాకరమైన ఆ కాఫీని ఎలా తాగుతున్నాడ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి కాఫీ చేయ‌డంపై మండిప‌డుతున్నారు. నెటిజ‌న్లు ఈ వీడియో చూసి ర‌క‌ర‌కాల కామెంట్లు చేస్తున్నారు. కాఫీ ప్రియులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.ఇప్ప‌టివ‌ర‌కు ఈ వీడియోను19 వేల మందికి పైగా చూశారు. ఈ వీడియో చూసిన చాలా మంది యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే కొంతమంది వినియోగదారులు ఈ కాఫీపై చమత్కరిస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా కామెంట్ చేశాడు. ఇలాంటి కాఫీ చేసి ఎవ‌రిని ఉద్ద‌రిస్తార‌ని వాఖ్యానించాడు. మ‌రొక‌రు ఈ కాఫీని చూస్తూనే క‌డుపులో తిప్పుతుంద‌ని అన్నాడు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఈ వీడియోను నెటిజ‌న్లు తెగ చూసేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories