Purse: ప‌ర్సులో ఈ 3 వ‌స్తువులు అస్స‌లు ఉంచుకోవ‌ద్దు..! ఎందుకంటే..

Do not Keep These 3 Items in the Purse at All
x
పర్సు (ఫైల్ ఇమేజ్)
Highlights

* వాస్తు ప్ర‌కారం ప‌ర్సులో కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను ఉంచుకోకూడ‌దు. * చ‌నిపోయిన వారి ఫొటోల‌ను ప‌ర్సులో పెట్టుకోవ‌డం దోషం.

Purse: సాధార‌ణంగా పురుషులు ప్ర‌తి ఒక్క‌రు ప‌ర్స్ మెయింటెన్ చేస్తారు. ఇందులో డ‌బ్బులు, ఏటీఎమ్ కార్డ్స్‌, ఇత‌ర‌త్ర ముఖ్య‌మైన ప‌త్రాలు, గుర్తింపు కార్డుల వంటివి పెట్టుకుంటారు. ఎందుకంట ఎప్పుడు ఏం అవ‌స‌ర‌మొస్తుందో తెలియ‌దు కాదా అని వీటిని మెయింటెన్ చేస్తారు. అయితే వాస్తు ప్ర‌కారం ప‌ర్సులో కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను ఉంచుకోకూడ‌దు. ఇవి అశుభ సంకేతాన్ని తెలియ‌జేస్తాయి. అంతేకాదు వీటివ‌ల్ల చాలా అన‌ర్థాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం.

1. దేవుని ఫోటో

దేవుడి ఫోటోను ఎప్పుడు కూడా ప‌ర్సులో పెట్టుకోకూడ‌దు. వాస్తు శాస్త్రం ప్రకారం పర్స్‌లో దేవుడి ఫోటో పెట్టుకోవడం వల్ల ఎవరికైనా అప్పుల భారం పెరుగుతుంది. ఈ కారణంగా వారు వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ ఇది తెలియ‌ని చాలామంది దేవుడి ఫొటోను పెట్టుకొని తిరుగుతుంటారు.

2. చనిపోయిన వారి ఫోటోలు ఉంచవద్దు

చాలాసార్లు కొంత‌మంది చనిపోయిన కుటుంబ సభ్యుల చిత్రాలను పర్సులో ఉంచుకోవ‌డం జ‌రుగుతుంది. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇది అశుభంగా పరిగ‌ణిస్తారు. ఎందుకంటే ప‌ర్సులో మనం డ‌బ్బులు పెట్టుకుంటాం. అలాంట‌ప్పుడు ఇందులో లక్ష్మిదేవి నివసిస్తుందని అంటారు. ఆ తల్లి తన స్థానంలో మరొకరిని చూస్తే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అందుకే చ‌నిపోయిన వారి ఫొటోల‌ను ప‌ర్సులో పెట్టుకోవ‌డం దోషం. ఇలా చేస్తే జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

3. పాత బిల్లులు

సాధారణంగా మనం ఏదైనా వస్తువు కొంటే దాని బిల్లు పర్సులో ఎక్కువ సేపు ఉంచుకోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు పాత బిల్లును ఎక్కువసేపు పర్సులో ఉంచుకుంటే అది అశుభంగా ప‌రిగ‌ణిస్తారు. దీనివ‌ల్ల జీవితంలో ఆర్ధిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని చెబుతారు. అందుకే పాత బిల్లుల‌ను ప‌ర్సులో ఉంచుకోకూడ‌దు.

Show Full Article
Print Article
Next Story
More Stories