"బ్రహ్మముహూర్తంలో మీరు ఇలా ఆలోచించి చేస్తే, మీకు ఎంతో లాభం"

బ్రహ్మముహూర్తంలో మీరు ఇలా ఆలోచించి చేస్తే, మీకు ఎంతో లాభం
x
Highlights

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం .... "బ్రహ్మముహూర్తంలో మీరు ఇలా ఆలోచించి చేస్తే, మీకు ఎంతో లాభం" మన జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలు...

ఫ్రెండ్స్ ! ఈ రోజు మనం చర్చించే అంశం .... "బ్రహ్మముహూర్తంలో మీరు ఇలా ఆలోచించి చేస్తే, మీకు ఎంతో లాభం"

మన జీవితంలో మనం అనుకున్న లక్ష్యాలు చేరుకోవటం, మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే ఎ గొప్ప విజయానికైన, మన రోజు వారి దినచర్య చాల ముఖ్యం. అందులోనూ ఒక రోజులోని, కొన్ని సమయాల్లో వాతావరణరీత్యా, ఆద్యాత్మిక సమయరీత్యా మనం ఎన్నో పనులు బాగా చెయ్యగలం. అలాంటి ఒక సమయమే బ్రహ్మ ముహూర్తం. అయితే ఈ బ్రహ్మ ముహూర్తం అనే పదాన్ని మీరు చాలాసార్లు వినే వుంటారు. అలాగే దీని అర్థం, పరమార్థం కూడా మీకు కొంత తెలిసేవుంటుంది.

ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని మనం ముహుర్తం అంటాము కదా. అలాగే మనం అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడాని కోసం, నిర్ణయించుకున్న మూహుర్తాన్ని మంచి ముహుర్తం అని అంటారు. అయితే ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలాన్ని, అనగా తెల్లవారుజామును కూడా చాల పనులకి మంచి ముహుర్తం అని పెద్దలు అంటారు. ప్రతి వ్యక్తికి కొన్ని గొప్ప పనులు చేయాలనీ వుంటుంది, అయితే ప్రతి గొప్ప పనిని ఎప్పుడో ఒకప్పడు మొదలు పెట్టాల్సిందే కదా. వెయ్యి మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలు అవుతుంది అంటారు. అలాగే మన జీవితంలో మనం గొప్ప విజయాలు సాదించాలి అనుకుంటే, మన లక్ష్యం వైపు అవసరమైన ముఖ్యమైన పనులను రోజు మనం చెయ్యడం చాల ముఖ్యం. ఆ పనులను ఎ సమయంలో చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము అనేది కూడా ముఖ్యమే. అయితే మన లక్ష్యానికి సంబంధించిన పనులకు, బ్రహ్మ ముహూర్తనికి ఒక మంచి సంభంధం వుంది, అదేంటో ఇప్పడు చూద్దాము.

ఫ్రెండ్స్ చాల మందికి బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున అని తెలుసు, కానీ తమ గడియారం ప్రకారం ఆ సమయం ఎప్పడు అనేది మాత్రం కొద్దిమందికే తెలుసు. ఆ సమయం ఎప్పుడో తెలుసుకోవాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది...తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజిస్తారు అని. సూర్యోదయమునకు రెండు ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని, ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. బ్రహ్మముహుర్త సమయంనందే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుందని మన శాస్త్రాలు చెపుతున్నాయి. మన శాస్త్రాల్లో చెప్పిన ఎన్నో విషయాలను, ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రజ్ఞులు హర్షిస్తున్నారు. బారతదేశ సంస్కృతిలోని ఎన్నో గొప్ప విషయాలు, మానవాళికి ఈ రోజుల్లో ఉపయోగపడుతాయి అని శాస్త్రజ్ఞులు రుజువు చేస్తున్నారు. అలాంటిదే మన ఈ బ్రహ్మముహుర్త సమయ సాధన కూడా. అయితే బ్రహ్మముహుర్తము సూర్యోదయానికి 48 నిమిషాల కన్నాముందు వున్నా 48 నిమిషాల సమయము అని అనుకున్నాం కదా. ఈ బ్రహ్మముహుర్థ సమయం మన గడియారం ప్రకారం ఉదయం 4.24 am to 5.12 am వరకు అని చెప్పవచ్చు. అయితే ఈ సమయాన్ని మీ విజయానికి పెట్టుబడిగా ఎలా పెట్టాలో మీకు తెలుస్తే, గొప్ప విజయాలు మీరు సాదించగలరు.

ఈ బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలని, పూజ చేయాలని, పిల్లలు చదువు కోవాలని మనం వింటూనే వుంటాము. అయితే ముందుగా ఈ కాలం విలువని మనం గుర్తించాలి. బ్రహ్మీముహూర్తం చాలా విలువైన కాలం. కానీ ఆ సమయానికి రోజు నిద్ర లేవటం అనేది సాధ్యమేనా అనే అనుమానం చాలామందికి వస్తుంది. ఇది సహజమైన అనుమానమే, దీనిని ఎలా జయించాలి అంటే...ప్రతి రోజు రాత్రి త్వరగా పడుకోవటం వలన, ముఖ్యంగా ప్రతి రోజు రాత్రి టీవీ ని, లేదా మీ స్మార్ట్ ఫోన్ ని త్వరగా పక్క్కకు పెట్టడం ద్వార...మీరు ఎక్కువ సమయం వాటిని చూడకుండా వుంటే మీకు ఎంతో కాలం కలసివస్తుంది. అలాగే మీ రాత్రి బోజనాన్ని ఏడూ గంటలలోపే తినటం వలన కూడా, నిద్ర బాగా పట్టి, మీరు ఉదయాన్నే నిద్ర లేవగలరు. అయితే నిద్ర లేచిన తర్వాత, ఈ బ్రహ్మముహుర్త సమయాన్ని వృధా చేయకుండ, మన విజయం కోసం సరిగ్గా ఎలా వాడుకోవాలో ఇప్పడు చూద్దాం.

ప్రతి రోజు ఉదయమే దాదాపు నాలుగు గంటల ప్రాంతంలో నిద్ర లేచి, ముందుగా మన రోజు వారి కాలకృత్యాలు చేసుకొని, 4.24 నిమిషాల తర్వాత మన శరీరానికి దాదాపు ఒక పది నిముషాలు వ్యాయయం చెయ్యాలి. ఆ తర్వాత ఒక నోట్ బుక్ మరియు ఒక పెన్ లేదా పెన్సిల్ తీసుకొని, మీకు వీలుగా వున్నా ఒక ప్రదేశంలో కూర్చొని, ఈ బ్రహ్మీముహూర్తంలోనే, అత్యంత శక్తివంతమైన "ఓంకారాన్ని" మనస్పూర్తిగా, పూర్తి ఏకాగ్రతతో 21 సార్లు ఉచ్చారణ చెయ్యాలి. ఈ సమయం చాల శక్తి వంతమైనది కాబట్టే మన ఋషులు, యోగులు, ఈ సమయంలో ఓంకారం జపిస్తారు, ఎంతో శక్తిని గ్రహిస్తారు. ముఖ్యంగా శాస్త్రీయత ప్రకారం కూడా మన శరీరంలో ఆ సమయలో అవసరమైన కర్టిజాల్ ఉత్పత్తి కావటం వలన, మన మనో స్థితి చాలాబాగా వుంటుంది, దానితో బాటు మన జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఇప్పటి వరకు తెలుసుకున్నట్టు.....ముందుగా కొంత శారీరక వ్యాయయం చేసి, ఆ తర్వాత 21 టైమ్స్ ఓంకార ధ్వనిని సాధన చేసిన తర్వాత, మూడవ స్టెప్ లో మన లక్ష్యం యొక్క సాధనలో, ముఖ్యమైన పనుల గురుంచి ఆలోచించాలి. ఆ పనులను మనం విజయవంతంగా చేస్తున్నట్టు ఉహించాలి. ఆ పనులు వలన ఎంతో మందికి మంచి జరుగుతున్నట్టు ఉహించండి. అలా ఆలోచిస్తున్నప్పుడు, మీకు కొన్ని అద్బుతమైన ఐడియాస్ రావచ్చు. ఆ ఐడియా రాగానే మీ పక్కనే వున్నా నోట్ పుస్తకములో, ఆ ఐడియా ని నోట్ చేసుకొని, ఆ ఐడియా ని ఎప్పుడు అమల్లో పెడుతున్నారో పక్కనే వ్రాసుకోవాలి. ఆ తర్వాత తిరిగి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మూడు దీర్ఘ శ్వాసలు తీసుకొని, ఆ తర్వాత లేచి మీ రోజు వారి కార్యక్రమాలు చేసుకొండి. ఇలా ఎప్పడైతే మీరు 41 రోజులు సాధన చేసి, ఈ బ్రహ్మముహుర్త సమయాన్ని మీ లక్ష సాధనలో బాగంగా వాడుకుంటారో, అప్పడు మీరు ఎన్నో గొప్ప విజయాలు సాదించగలరు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories