" మనకి అంతటా అవకాశాలే ఇలా చేస్తే".

 మనకి అంతటా అవకాశాలే ఇలా చేస్తే.
x
Highlights

ఫెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం.... " మనకి అంతటా అవకాశాలే ఇలా చేస్తే". ఎలాంటి వ్యాపారం చేద్దామన్న పోటి ఎక్కువగా వుంది, ఒకప్పట్టిలా అవకాశాలు...

ఫెండ్స్ ఈ రోజు మనం చర్చించే అంశం.... " మనకి అంతటా అవకాశాలే ఇలా చేస్తే".

ఎలాంటి వ్యాపారం చేద్దామన్న పోటి ఎక్కువగా వుంది, ఒకప్పట్టిలా అవకాశాలు లేవు అని భాదపడసాగాడు పవన్ తన మిత్రుడితో......

నా సబ్జెక్టు చదివిన వారికీ, పెద్దగా జాబు అవకాశాలు లేవు, నీవు వేరే సబ్జెక్టు చదువు అని చెప్పసాగాడు...రవి తన తమ్ముడితో.......

ఈ ప్రభుత్వం మారనంత వరకు, ఎలాంటి అవకాశాలు మన వారికి రావు, అని అనుకోసాగాడు రాజు........

ఇలా కొద్ది మంది ప్రస్తుతం ఎలాంటి అవకాశాలు లేవని, ఒకప్పుడు ఎన్నో అవకాశాలు ఉండేవని, ఒకప్పుడు ఇంత పోటి లేదని నిరాశ భావం తో వుంటారు. ఎక్కడ చూసినా వారికీ అవకాశాల తలుపులు మూసినట్టే కనపడతాయి. ఉన్న దానితో తృప్తి పడలేక, కొత్త అవకాశాలు సృష్టించుకోలేక..ఎంతో ఇబ్బంది పడుతుంటారు . ఇలాంటి వారిని కలిసి మనం కొద్దిసేపు మాట్లాడుతే, నిజంగానే జీవితంలో ఎదగటానికి, గెలవటానికి ఎలాంటి అవకాశాలు సామాన్యులకి లేవేమో అనిపిస్తుంది. కానీ ఫ్రండ్స్...అది వాస్తవం కాదు.

ఈ రోజుల్లో టెక్నాలజీ పెరగటం వలన, ఆర్ధికంగా దేశం ముందుకు వెళుతూ వుండటం వలన, ఇప్పటి వరకు ఎప్పుడు లేనన్ని అవకాశాలు, అన్ని రంగాలలో వున్నాయి, ఇంకా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి, అయితే ఈ అవకాశాలను అందిపుచ్సుకోడానికి మనం సిద్దంగా వున్నామా అనేదే అసలు ప్రశ్న. అసలు కొద్దిమంది ఎలాంటి పరిస్థితిలో వున్నా, ఎ రంగంలోనైన కూడా విజేతలుగా నిలుస్తున్నారు. అలాంటి వారి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఫ్రెండ్స్ ! మీరు సీనియర్ ఎన్టీఆర్ నటించిన "పాతాళ బైరవి" సినిమాలోని ఒక ఫేమస్ డైలాగ్ విన్నారా! అదేంటంటే "సాహసం సేయరా డింభకా రాజకుమారి లభించును" అని ఒక ముఖ్య పాత్ర చెపుతూవుంటుంది. అలాంటి మాటలే ఈ రోజుల్లో కూడా, మనం మన అవకాశాల విషయంలో మాట్లాడుకోవచ్చు. మనం అందుకోవాల్సిన అవకాశలు కూడా సాహసవంతులను, దైర్యవంతులను వెతుక్కుంటూ వస్తాయి. కానీ కొద్దిమంది తమ చుట్టూ ఎటు చూసిన సమస్యలు వున్నాయని బాధ పడుతూ, ఏమి చెయ్యకుండా ఆ సమస్యలు తొలగిపోవాలని వేచి చూస్తుంటారు. ఒక వేళా అలా మీ చుట్టూ సమస్యలు ఉన్నాయి అంటే, మీ చుట్టూ ఎన్నో అవకాశాలు ఉన్నాయి అని అర్థం. ఎందుకంటే..సమస్య వున్న చోటే..ఎన్నో అవకాశాలు వుంటాయి. అందుకే...ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటాడు... "అసౌకర్యాల మధ్యలో అవకాశం ఉంటుంది అని". అయితే ఆ అవకాశాలను మనం వాడుకుంటే, ప్రపంచం మనని అదృష్టవంతుడు అంటుంది.

కాని అసలు అదృష్టవంతులు అంటే ఎవరు అని పరిశోధిస్తే, ఎవరైతే రాబోవు అవకాశాలకి అనుగుణంగా తమని సంసిద్ధం చేసుకుంటారో వారు అదృష్టవంతులు. అలా ఎప్పుడైతే వారి సంసిద్ధత మరియు అవకాశం ఈ రెండు కలుస్తాయో ...అప్పడు వారిని అదృష్టం వరిస్తుంది. కాబట్టి అవకాశాలు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు, అవకాశం ఏరోజైనా మన తలుపు తట్టవచ్చు కాబట్టి మనం చేయాల్సిందల్లా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సంసిద్ధంగా ఉండడమే. అన్ని విధాలుగా మనం సన్నద్ధంగా వుంటే..అవకాశం రాగానే...క్రికెట్ గ్రౌండ్లో బౌండరి వద్ద వున్నా ఫీల్డర్లా ఆ అవకాశాన్ని పట్టుకోవచ్చు. అయితే ఈ అవకాశాలను ఎలా గుర్తించాలో ముందుగా మనం తెలుసుకోవాలి.

ముఖ్యంగా మార్పు అనేది ఎక్కడ ఎక్కువ జరుగుతుందో చూడండి. మార్పు తీవ్రంగా వున్నా దగ్గర కొత్త అవకాశాలు చాల వుంటాయి. అలాగే అవకాశాలని గుర్తించడానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులను, పరిసరాలన్నీ, పరిశీలించాలి, పరీక్షించాలి, పరిశోధించాలి. ఎప్పుడైతే ఇలా మనం ఒక కొత్త కోణంలో మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనం చూస్తామో, ఎన్నో అద్భుతమైన అవకాశాలు మన కళ్ళకి కనపడవచ్చు. ముఖ్యంగా మన కోరిక లేదా లక్ష్యం తీరడానికి, మన చుట్టూ ఉన్న అవకాశాలు ఏంటో ముందుగా గుర్తించాలి. అలాగే ఎలాంటి అవకాశాలను మనం సృష్టించుకోవాలో, అవి ఎక్కడ, ఎలా, ఎప్పడు, ఎవరితో సాధ్యం అని ఆలోచించాలి. ఇలా సరైన విధంగా ఒక ప్రణాళిక రచించుకుంటే మన లక్ష్య సాధన సులభమవుతుంది.

మన జీవితంలోని ఎన్నో విభాగాలలో మనకి అవకాశాల అవసరం ఉంటుంది. అవి ఉద్యోగావకాశాలు అయి ఉండవచ్చు. వ్యాపార అవకాశాలు అయి ఉండవచ్చు లేదా మన బంధాలూ పెంచుకోనడానికి అయి వుండవచ్చు, లేదా స్నేహాలు పెంచుకోడానికి అయి ఉండవచ్చు. ఇలా ఏ అవకాశం అయినా మన విజయం కోసం వాటిని సృష్టించుకోవడం,అందిపుచ్చుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మన అవకాశాలను ఈ మూడు విధానాలుగా పెంచుకోవచ్చు, అందిపుచ్చుకోవచ్చు.

ఒకటి....కొత్త అవకాశాలను ఉహించండి.

ముందుగా మీ యొక్క లక్ష్యాలని స్పష్టంగా పెట్టుకోండి. వాటిని సాదించటానికి మీకు కొన్ని అవకాశాలు కావాలని గుర్తించండి. ఎలాంటి అవకాశాలు కావాలో ఉహించండి. అలాంటి అవకాశాలు మీకు వస్తున్నట్టు ఉహించండి. అలాగే మీ శక్తి సామర్ధ్యాలను తెలుసుకొని మీ నైపుణ్యాలను వాడుకోవడం ఎలాగో ఆలోచించండి అలాగే మీ బలహీనతలను కూడా గుర్తించండి. ఆ బలహీనతలు మీ అవకాశాలను దూరం చెయ్యకుండా జాగ్రత్త తీసుకొండి. అలాగే మీరు ఏ పనిని ఎక్కువ గంటలు.. ఎక్కువ ఆనందంగా చేస్తారో ఆలోచించండి.

రెండు....కొత్త అవకాశలకోసం అడగండి.

అడగందే అమ్మ అయిన పెట్టదంటారు...కాబట్టి అవకాశాల గురించి ఇతరులను మనం అడగాలి. ముఖ్యంగా నెట్ వర్కింగ్ చేస్తువుండండి, మీకు తెలిసిన వారి ద్వారానే అవకాశలు వస్తాయి కాబట్టి. అలాగే మీకు ఏమి తెలుసు అనేది ఎంత ముఖ్యమో...మీకు ఎవరు తెలుసు అనేది కూడా అంతే ముఖ్యం అని గుర్తించండి. ఆ అవకాశాన్ని బట్టి మీరు మిమ్మల్ని మార్చుకోడానికి సిద్దంగా వుండండి, కొత్త పని, కొత్త బాద్యత, కొత్త పరిస్థితులు ఇలా ఏదైనా కూడా దానికి అనుగుణంగా మారటానికి సిద్దంగా వుండండి. మార్పు మంచిందే అని తెలుసుకొండి. ఎందుకంటే..ఎవరైనా మన కోసం అవకాశం అనే తలుపు తెరవవచ్చు...కానీ లోపలికి వెల్లవల్సింది మాత్రం మనమే కదా!

మూడు......కొత్త అవకాశాలను అందుకోడానికి సిద్దంకండి.

నేర్చుకోండి..నేర్చుకొండి..నేర్చుకోండి. ఎవరితే నిత్య విద్యార్తి లా వుంటారో..వారు ఎన్నో విజయాలు సాదిస్తారు. నేర్చుకోవడం అంటే...ఆ పని చేస్తూ నేర్చుకోవడం. అలాగే "ప్రోఆక్టివ్" గా ఆ పనిలో ముందుకి అడుగు వెయ్యండి. మీ లక్ష్యం వైపు అవసరమైన పని చెయ్యడానికి ఎప్పుడు ముందు వుండండి. అలా చేస్తూ వెళితే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మిత్రమా. వాటిని మీరు అందుకోవడం ద్వారా విజేతగా నిలుస్తారు. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories