భయం భరువు తగ్గించుకోండి ఇలా?

భయం భరువు తగ్గించుకోండి ఇలా?
x
Highlights

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... భయం భరువు తగ్గించుకోండి ఇలా? భయం..భయం..భయం... కొద్దిమందికి నలుగురి ముందు మాట్లాడాలంటే భయం, కొద్దిమందికి...

ఫ్రెండ్స్! ఈ రోజు మనం చర్చించే అంశం... భయం భరువు తగ్గించుకోండి ఇలా?

భయం..భయం..భయం... కొద్దిమందికి నలుగురి ముందు మాట్లాడాలంటే భయం, కొద్దిమందికి విమానప్రయాణం అంటే భయం, కొద్దిమందికి పరిక్షలు అంటే భయం, కొద్దిమందికి బాస్ అంటే భయం, మరి కొద్దిమందికి బార్యంటే భయం, కొద్దమందికి బల్లి అంటే లేదా బొద్దింక అంటే...ఇలా భయానికి కారణం ఏదైనా కూడా, వారి భయం చాల సార్లు వారి అభివృద్దిని ఆపుతుంది. ఆ భయం వారి విజయం వైపు అడుగు వెయ్యనికుండా వారిని, ఎక్కడ ఉన్నారో అక్కడే స్తబ్ధ జీవిలా మార్చేస్తుంది. ఎంతో మంది వారి జీవితంలో, వారు కోరుకున్న లక్ష్యాలని చేరకపోవటానికి, వారి కోరికలను తీర్చుకోలేక పోవటానికి, వారి కలలను నిర్వీర్యం చేసుకోడానికి ముఖ్య కారణం ఈ భయం. మరి ఈ భయాన్ని ఎలా జయించాలో తెలిస్తే మాత్రం, మనం ఎన్నో విషయాలలో గొప్ప విజయాలు సాదించవచ్చు అని ఎన్నో పరిశోదనలు చెపుతున్నాయి. కాబట్టి ఈ భయాన్ని ఎలా జయించాలో ఇప్పుడు చూద్దాం.

1. ఎ సందర్భంలో వస్తుందో గుర్తించండి: మీకు ఎలాంటి సమయంలో ఎక్కువగా భయం వేస్తుందో గుర్తించటం చాల ముఖ్యం. కొద్దిమందికి కొన్ని సందర్భాల్లో లేదా కొన్ని సమయాల్లో ఎక్కువగా భయం కావచ్చు. అలాగే కొద్దిమంది ఒక రకమైన వ్యక్తులను కలిసినప్పుడు లేదా వారితో మాట్లాడుతున్నప్పుడు భయం కలగవచ్చు. కాబట్టి ముందుగా మీరు ఎక్కువగా ఎ సందర్భంలో భయానికి గురి అవుతున్నారో చెక్ చేసుకోండి.

2. సహజమైనదా లేక అపోహన తెలుసుకోండి: కొన్ని భయాలు సహజమైనవి వుంటాయి, కాని కొన్ని భయాలు మన అపోహలు మాత్రమే అయివుంటాయి. ఎత్తు పైనుండి క్రిందకి చూస్తే కలిగే భయం సహాజమైనదే, ఎందుకంటే మనిషికి పుట్టుకతోటే ఎత్తు ప్రదేశాలన్న లేదా పెద్ద శబ్దాలన్న సహజంగానే భయం వుంటుంది. కాని కొద్దిమందికి లైఫ్ లో చిన్న చిన్న విషయాలు అయిన లిఫ్ట్ లో వెళ్ళాలన్న భయపడుతారు, బల్లిని చూసి కూడా పులిని చూసినట్టు భయపడుతారు, ఈ భయాలు అపోహలనే చెప్పవచ్చు. కాబట్టి మన భయానికి సరైన సాక్ష్యం వుంటే మాత్రమే అది సహజ భయం అని గుర్తించాలి.

3. దీర్గ శ్వాస తీసుకోండి: భయం అనేది మన మనస్సులోకి రాగానే మనకి చమటలు పట్టవచ్చు లేదా కాళ్ళు వనకవచ్చు, ఆ సమయములో మనం సరిగ్గా ప్రతిస్పందిచకపోవచ్చు. ఆ భయంలో ఇంకా ఇబ్బంది పెట్టె పనులు చేయవచ్చు, కాబట్టి ఆ ఆందోళనని తగ్గించుకోవాలి అంటే మాత్రం, మన చేతిలో వున్నా మంచి చిట్కా.... మన శ్వాస అని గుర్తించాలి. ఇప్పటి నుండి మీరు ఎప్పుడు కొంత భయానికి గురి అయిన కూడా వెంబడే ఏడూ సార్లు దీర్గ శ్వాస తీసుకోండి, ఎప్పుడైతే మీరు దీర్గ శ్వాస తీసుకోవడం మొదలేదుతారో మీ ఆందోళన తగ్గి, కొంత ప్రశాంతతని మీరు పొందుతారు. ఆ పైన మీరు ఏమి చెయ్యాలో, ఆ భయాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించగలరు.

4. దానిని అప్రమత్తతో ఎదుర్కొనండి: భయాన్ని ఎదుర్కోవడం వలెనే మనం భయాన్ని తగ్గించుకోగలం, అంటే ఎ పని చేయ్యండానికి మనకు భయం అవుతుందో ఆ పని చెయ్యటం చాల అవసరం, కాని మీకు అనుమానం రావచ్చు, ఆ పని చేయ్యలంటేనే భయం అయినప్పడు ఎలా దానిని చెయ్యగలము అని, సో ఈ విషయంలో ఆ పని చెయ్యడానికి మన సంసిద్దతత చాల ముఖ్యం, ఉదాహరణకి మీకు నీళ్ళు అంటే భయం అనుకుందాం, ఎక్కడ నీళ్ళు మీరు చూసిన కూడా మీరు వాటినుండి దూరం వెళతారు అనుకుంటే, మీరు ఆ నీటి లోకి వెళితేనే భయం పోతుంది అని అంటున్నాము కదా, మరి ఎలా వెళ్ళాలి అంటే... ఎలాంటి అప్రమత్తత లేకుండ నీళ్ళలో వెళ్ళమని కాదు. మీరు ఆ నీటి భయం పోగుట్టుకోడానికి ముందుగా ఒక స్విమ్మింగ్ పూల్ లో, ఒక కోచ్ సహాయం తీసుకొని, వారి పర్యవేక్షణలో నీటిలోకి దిగాలి, ఇప్పుడు మీకు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం వున్నా కోచ్ వున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు, మెల్లిగా మీరు స్విమ్మింగ్ కూడా నేరుచుకోగలరు.

5. ఆ విషయంలో నిష్ణాతుల సహాయం తీసుకోండి: మీరు ఎదుర్కోబోతున్న భయానికి సంబందిన్చిన ఒక నిష్ణతుని యొక్క సహాయం మాత్రం తప్పక తీసుకోండి, లేకుంటే అనవసర ఇబ్బందులో మీరు పడి, మీ భయం ఇంకా పెరగవచ్చు.

6. పాజిటివ్గా ఉహించడం మొదలెట్టండి: మీరు ఎ విషయంలో అయితే భయపడుతున్నారో, ఆ విషయంలో విజేతగా నిలుస్తున్నట్టు, ఆ భయాన్ని గెలిచి దైర్యంగా ఆ పని చేస్తున్నట్టు ఉహించుకోండి, ఇలా చేయడం వలన త్వరగా మీ భయాన్ని జయించగలరు. ఎందుకంటే చాల సందర్బాలలో మన భయాలు కూడా మన ఉహల నుండే పుడుతాయి కాబట్టి. ఎప్పుడైతే మనం ఒక విషయాన్నీ పాజిటివ్ గా ఉహిస్తున్నమో అప్పుడు భయపడే అవకాశమే ఉండదు.

సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం చర్చించిన విషయాలను మీరు ఆచరణలో పెట్టి మీ భయం యొక్క భరువు తగ్గించుకుంటారని ఆశిస్తున్నాము. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories