మీ "మూడ్ యొక్క స్విచ్" ఎక్కడుందో మీకు తెలుసా?

మీ మూడ్ యొక్క స్విచ్ ఎక్కడుందో మీకు తెలుసా?
x
Highlights

ఫ్రెండ్స్ మనం ఈ రోజు చర్చించే అంశం......మీ "మూడ్ యొక్క స్విచ్" ఎక్కడుందో మీకు తెలుసా? ఒక రోజు రాత్రి 8 గంటలకు, రఘు తన కారులో ఆఫీస్ నుండి...

ఫ్రెండ్స్ మనం ఈ రోజు చర్చించే అంశం......మీ "మూడ్ యొక్క స్విచ్" ఎక్కడుందో మీకు తెలుసా?

ఒక రోజు రాత్రి 8 గంటలకు, రఘు తన కారులో ఆఫీస్ నుండి ఇంటికి వెళుతూ కారులోని "ఎఫ్ ఎం రేడియో" లో "సాగర సంగమం" సినిమాలోని "మౌనమేలనోయి...ఈ మరపు రాని రేయి. అనే పాటని వింటున్నాడు. ఆ పాట వింటూనే... అతని మూడ్ స్విచ్ అయ్యి...ఒక్క సెకండ్ లోనే...అతని ఆలోచనలు, ఆ సినిమా చూసిన రోజుల్లోకి వెళ్లి పోయాయి, ఆ సినిమా ఎవరితో చూశాడు, అప్పుడు ఏ వయస్సులో ఉన్నాడు, ఆ రోజుల్లో అతనికి బాగా ఇష్టమైన వ్యక్తి గురించిన ఆలోచనల్లోకి, తన మనసు... అతనిని తీసుకువెళ్ళింది.

టింకు సండే రోజు మద్యాన్నం ఇంట్లో..టీవీ లో డాన్స్ ప్రోగ్రాం చూస్తున్నాడు, ఆ ప్రోగ్రాం బ్రేక్ లో ఒక ఐస్ క్రీమ్ యొక్క అడ్వటైజ్మెంట్ వచ్చింది. టింకు మనసులో.... మూడ్ స్విచ్ అయ్యి ఒక్క సెకండ్ లోనే .....ఆ ఐస్క్రీం గతంలో తిన్నప్ప్పుడు ....ఎంత బాగా క్రీమీ గా వుంది...ఎంత తియ్యగా వుంది, ఎంత స్మూత్ గా వుంది, అవన్నీతన మనసులో గుర్తుకు వచ్చాయి. వెంబడే తినాలనే కోరక విపరీతంగా పెరిగింది.. అప్పటికప్పుడు టింకు వాళ్ళ అమ్మని ఆ ఐస్క్రీం కొనిమ్మన అడగ సాగాడు.

అప్పటి వరకు హుషారుగా వున్నరాధిక కి పక్కింట్లో నుండి వస్తున్నా సంబారు వాసనకి... ఆవిడ మూడ్ స్విచ్ అయ్యి ఒక్క సెకండ్ లోనే... తన అమ్మ చేసే సాంబారు గుర్తుకి తెచ్చింది...వెంబడే ఒక చేదు నిజం గుర్తుకి వచ్చింది...ఇక తాను అమ్మ సంబారు తినలేననే నిజం గుర్న్తుకు వచ్చి, తను చనిపోయేముందు ఎంత ఇబ్బంది పడిందో... గుర్తుకి వచ్చి, కొన్ని సెకండ్స్ లోనే ఎంతో బాధ, దుఖం రాసాగాయి...

ఫ్రండ్స్...

రఘుకి, టింకుకి, రాధికకి ఒక సెకండ్ లో తమ మూడ్ స్విచ్ అయిపోయింది...వారుకి తెలియకుండానే వారు ఒక ఫీలింగ్ లోకి, ఒక ప్రతిస్పంధనకి గురయ్యారు...ఇలా అత్యంత తక్కువ టైం లో మూడ్ మారటాన్ని NLP లో యాంకరింగ్ అంటారు. ఎలాగైతే సముద్రతీరంలో పడవవని నిలపటం కోసం ఒక యాంకర్ వాడతారో, అలాగే ఒక మానసికస్థితిలో మనని తీసుకెల్లెది, వుంచేది..ఈ యాంకర్స్. ఒక దానిని చూడటం ద్వార, వినటం ద్వార, టచ్ ద్వార, స్మెల్ ద్వార..లేదా రుచి ద్వార ఇలా ఒకప్పటి ఫీలింగ్స్ గుర్తుకు వచ్చి, ఆ మానసిక స్థితి లోకి, లేదా ఆ మూడ్ లోకి ఇప్పుడు వెళ్ళటం అని అర్ధం. అయితే ఈ యాంకర్ అనే టెక్నికు తో మనకి, ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, ఉల్లాసం లాంటి ఎ ఫీలింగ్ అయిన, ఎ సమయంలో కావాలనుకున్న, అలా వచ్చేట్టు చేసుకోగలిగితే మనకి అద్బుతమైన లాభాలు వుంటాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాము.

ఎప్పుడైతే మనం ఆలోచించకుండా ప్రస్తుత స్థితి నుండి వేరొక మానసిక స్థితి కి వెళుతున్నమో, అవి మన యాంకర్ అని అర్థం. ఉదాహరణకి రోడ్ మీద మనం వెళుతున్నప్పుడు, ట్రాఫిక్ సిగ్నల్ లలో రెడ్ లైట్ చూడగానే ట్రాఫిక్ లో ఆగడం, మనం పెద్దగా ఆలోచించకుండానే చేస్తాము కదా ఇది ఒక యాంకరే. అలాగే ప్రముఖ సినిమా హీరొయిన్ శ్రీదేవి గారు, తన సినిమా షూటింగ్ మద్యలో ఎక్కువగా గంబిరంగా వుండేవారట...కానీ కెమెరా ముందుకు ఒక్కసారి తను వెళ్ళగానే, డైరెక్టర్ ఆక్షన్ అని చెప్పగానే ఎంతో చలాకీగా, ఎ ఎమోషన్ అయిన పండించేదట..అంటే ఆవిడకి కెమరా చూడగానే, ఆక్షన్ అని వినగానే, ఈ రెండు గొప్ప ప్రేరకాలుగా అంటే యాంకర్స్ గా పని చేసి, తన నటనకు కావలసిన మంచి మానసిక స్థితికి తను వెళ్లి, అద్భుతంగా నటించగలిగేదట.

కాని రాధిక యొక్క విషయంలో జరిగినట్టు...కొద్దిమందికి ఎప్పుడో వారికీ తెలియకుండా ఏర్పడిన యాంకర్స్, వారిని ఎంతో ఇబ్బంది పెడతాయి. అయితే నిజమైన మానసిక స్వతంత్రం అనేది మనపై పని చేస్తున్నా యాంకర్స్ ని గుర్తించడం, అలాగే దేనికి ఎలా ప్రతిస్పందించాలో ఎంచుకోవడం ద్వారానే సాద్యం. కాబట్టి ఈ యాంకర్స్ గురుంచి తెలుసుకొని, వాడుకోవలసిన అవసరం వుంది.

ఈ ఆంకర్ ముఖ్యంగా 3 రకాలు

1 విజువల్ యాంకర్

2 ఆడిటరి యాంకర్

3 కేనస్తటిక్ యాంకర్ అంటారు.

1 విజువల్ యాంకర్: విజువల్ యాంకర్ యొక్క ఉదాహరణలు....మన జాతీయ పతాకం చూడగానే మనలో వచ్చే ఆ దేశభక్తి భావన, ఏదైనా మనకు నచ్చిన చిన్నప్పటి పోటో చూడగానే గుర్తుకు వచ్చే జ్ఞాపకాలు, ఇష్టమైన వ్యక్తి యొక్క ఒక స్మైల్.... ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ లైట్ ఇలాంటివన్నీ విజువల్ యాంకర్స్గా పనిచేస్తాయి. చాల వ్యాపార ప్రకటనలన్ని, మన మనస్సుని వారి ప్రోడుక్ట్కి యాంకర్గ చెయ్యడానికి వాడుతారు. అదెలాగో ఇప్పుడు చూద్దాము.

వ్యాపార ప్రకటనలు చేసేవారు, తమ ప్రకటనలో ముందుగా మనకి ఇష్టమైన హీరోని చూపెడతారు...ఆ హీరోని చూడగానే..ఇంతకు ముందు..వారు చేసిన సినిమా పాత్రలు గుర్తుకి వచ్చి, మనం ఒక ఫీలింగ్ లో వుంటాం కదా, ఆ సమయంలో మన హీరో తో, వారి కూల్ డ్రింక్ తాగండి అని చెప్పిస్తారు, అలా ఆ హీరో మీద వున్నా అభిమానం, ఆ కూల్ డ్రింక్ కి లింక్ అయ్యి..ఆ కూల్ డ్రింక్ ప్రకటన ఒక యాంకర్ లా, ఓక ప్రేరకంగా పని చేసి, మనని ఆ కూల్ డ్రింక్ తాగేలా చేస్తుంది. ఇలా అన్ని వ్యాపార ప్రకటనలు తమ ప్రొడక్ట్స్ కి, మన మంచి ఫీలింగ్స్ యాడ్ చేయడం కోసం, టీవీ ద్వార, రేడియో ద్వార, పిక్చర్ హోర్డింగ్ ద్వార వారు...యాంకర్ చెయ్యటానికే ట్రై చేస్తుంటారు.

2 ఆడిటరి యాంకర్: ఒక మ్యూజిక్ వినటం వల్ల మీకు వచ్చే జ్ఞాపకాలు, ఉదాహరణకి ఎయిర్ టెల్ మ్యూజిక్ వినగానే...ఆ కంపెనీ గుర్తుకు వచ్చినట్టు...కొన్ని మాటలు లేదా కొన్ని శబ్దాలు....ఉధహరణకి..."బిస్కెట్"..........అనే మాట వినగానే మీకు ఏదో సంఘటన గుర్తుకురావచ్చు. ఇలా మనం వినే విషయాలు కూడా మన మనో స్థితిని మార్చగలవు.

3 కేనస్తటిక్ యాంకర్: ఒక శరీర విన్యాసం కూడా ఎంతో ఎమోషన్ ని ఇస్తుంది. ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్ లో ఒక బౌలర్, వికెట్ తియ్యగానే తన చేతిని గాలిలో తిప్పటం ఒక కేనస్తటిక్ యాంకర్, అలా తిప్పటం వల్ల బౌలర్గా తన మానసిక స్థితిని ఆక్టివ్ చేసుకుంటున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ తన చేతిని మెడ వెనక బాగంలో తీసుకేల్లగానే..తన ఫాన్స్ ఒక ఉత్సాహంలో వెళ్ళటం చూస్తుంటాం.. తన చేతి కదలిక ఒక యాంకర్లా పనిచేస్తుంది. అలాగే పెర్ఫ్యూమ్ వాసనా చూడగానే వచ్చే ఫీలింగ్స్... లేదా ఒక ఫుడ్ టేస్ట్ చెయ్యగానే గుర్తుకు వచ్చే విషయాలు ..ఇలాంటివన్ని కేనస్తటిక్ యాంకర్గా పనిచేస్తాయి.

అసలు ఈ యాంకర్స్ వల్ల లాభం ఏంటి అని చూస్తే...మనము ఏదైనా ముఖ్యమైన పనిని చేసేముందు, కాన్ఫిడెన్సు చాల అవసరం వుంటుంది కదా....ఈ యాంకర్ ద్వార మీ మూడ్ ని ఒక్క క్షణం లోనే ఆ కాన్ఫిడెన్సు తెచ్చుకుంటే చాల సులభంగా పని చేయగలరు. అందుకోసం మీరు ప్రశాంతంగా ఒక ప్లేస్ లో కూర్చొని, మీరు ఇప్పటివరకు చాల కాన్ఫిడెన్సు తో చేసిన ఎ పనినైన సరే గుర్తుకు చేసుకోవాలి. ఆ సంఘటనలో ఏమి చూసారో, అది చూడండి, అప్పుడు ఏమి విన్నారో..అంది ఇప్పుడు మీ మనస్సులో గుర్తుకి తెచ్చుకొని వినండి, అలా అప్పటి ఫీలింగ్స్ గుర్తుకి తెచ్చుకోండి...ఆ ఫీలింగ్ ఎక్కవగా వచ్చినప్పుడు, ఆ కాన్ఫిడెన్సును మీరు ఇప్పుడు....ఒక యాంకర్ లా, మలచుకోడానికి మీ కుడి చేతి "ఫిస్ట్" ని క్లోజ్ చేసి ఆ ఫీల్ ని అనుభూతి చెందుతూ...మీ మనస్సులో "యస్"... "యస్"... "యస్" అని రిపీట్ చేస్కొండి.

ఇలా రెండు మూడు సార్లు చేసుకోవడం వల్ల ఆ కాన్ఫిడెన్సు మీకు ఒక యాంకర్ గా అందుబాటులో వుంటుంది. ఇక భవిష్యత్తులో మీకు ఎప్పుడు కాన్ఫిడెన్సు కావాలన్నా, జెస్ట్ మీరు మీ కుడి చేతి ఫిస్ట్ ని క్లోజ్ చేసి, మీ మనస్సులో "యస్"... "యస్"... "యస్"...అని రిపీట్ చేస్కొండి.. ఇలా చెయ్యడం వల్ల, కొన్ని క్షణాలలోనే మీకు మునపటి కాన్ఫిడెన్సు వచ్చేస్తుంది. దానితో మీ ముందు వున్నా ఎ పనైనా చాల కాన్ఫిడెన్సుతో చెయ్యగలరు.

సో ముందుగా మన రోజువారీ జీవితంలో ఎలాంటి యాంకర్స్ ఉన్నాయో గుర్తించాలి. రఘు విన్న పాట తనకి యాంకర్గా పెద్ద నష్టాన్ని ఇవ్వకున్నా కూడా, టింకు ఎక్కువ ఐస్ క్రీం తినడంవల్ల, రాధిక వారి అమ్మగారి చివరి రోజులే గుర్తుకు చేసుకుంటూవుండటం వలన ఎక్కువ నష్టమే వుంటుంది, అందుకే మనం, మనని ఇబ్బంది పెట్టె యాంకర్స్ ని మార్చుకోవాలి. అలాగే మనకి ఉపయోగపడే యాంకర్స్ ని సృష్టించుకోని, వాటిని వాడుకుంటూ విజేతగా నిలవాలి. ఈ యాంకర్స్ని మీరు కోరుకునే, ఇష్టపడే విషయాల్లో ఎలా రకరకాలుగా ఏర్పర్చుకోవలో ముందు, ముందు చూద్దాము. అల్ ది బెస్ట్.

Show Full Article
Print Article
Next Story
More Stories