అమెరికాలోని మన విద్యార్థులతో మాట్లాడతాం – భారత రాయబార కార్యాలయం

అమెరికాలోని మన విద్యార్థులతో మాట్లాడతాం – భారత రాయబార కార్యాలయం
x
Highlights

అమెరికా లో ఫేక్ యూనివర్సిటీల బాగోతానికి ప్రభుత్వ ఉచ్చులో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను విడిపించడానికి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా...

అమెరికా లో ఫేక్ యూనివర్సిటీల బాగోతానికి ప్రభుత్వ ఉచ్చులో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను విడిపించడానికి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. విద్యార్థుల అరెస్టుపై తీవ్రమైన అభ్యంతర పత్రాన్ని కూడా జారీ చేసింది. విద్యార్థుల వెనుక భారత ప్రభుత్వం ఉందని మర్చిపోవద్దని ఇప్పటికే అమెరికాకు చెప్పింది. భద్రతా అధికారుల నిర్బంధంలో ఉన్న విద్యార్థులందరితోనూ నేడు(సోమవారం) మాట్లాడే ప్రయత్నం చేస్తామని

ఇండియన్ ఎంబసీ చెప్పింది. అమెరికాలో భారతీయ దౌత్యవేత్త హర్షవర్దన్ శ్రింఘాల ఈ విషయాన్ని ధ్రువీకరించారు. డిటెన్షన్ లో ఉన్న విద్యార్థులను వీలైనంత త్వరగా కలుసుకుంటామన్నారు. వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామన్నారు. అవసరమైతే లాయర్ల ప్యానల్ తో మాట్లాడవచ్చన్నారు. కాగా మిచిగాన్ లో.. యూనివర్సిటీ ఆఫ్ ఫర్మింగ్ టన్ పేరుతో ఓ నకిలీ విశ్వవిద్యాలయాన్ని సృష్టించి అందులో విద్యార్థులను చేర్చుకుంది. ఇందులో మన విద్యార్థులు చిక్కుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories