హాట్‌ టాపిక్‌గా మారిన ప్రియాంక చోప్రా పారితోషకం

Submitted by arun on Sun, 12/17/2017 - 15:14
Priyanka Chopra

ఎవరూ ఏ స్థాయిలో  పోటీ పడినా దీ  బెస్ట్‌గా నిలుస్తోంది. అలా కనిపిస్తే చాలు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధమవుతున్నారు. హాలీవుడ్‌ రేంజ్‌లో  ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న బ్యూటీ  ఓ న్యూస్‌తో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ మ్యాటరేంటో తెలియాలంటే ఈ స్టోరి చూడాల్సిందే. 

తన  గ్లామర్ షోలతో  కుర్రకారును ఆకట్టుకున్న  బ్యూటీ  ప్రియాంకచోప్రా. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు ప్రమోట్‌ అయినా ఈ బ్యూటీకి  ఉన్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. తన టాలెంట్‌తో రాకెట్‌ స్పీడ్‌తో దూసుకుపోవడంతో పాటు వరల్డ్‌వైడ్‌ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకుంటుందీ బ్యూటీ. పర్పామెన్స్‌ తోనే కాదు రెమ్యూనరేషన్‌లో తనను ఎవ్వరూ బీట్‌ చేయలేరని నిరూపిస్తోంది. 

హాలీవుడ్‌ మూవీలతో బీజీగా గడుపుతున్న ప్రియాంక తన డ్యాన్స్‌ షోతో దుమ్మురేపేందుకు సిద్ధమైంది. హాలీవుడ్‌ స్థాయి కావడంతో ఎలాగైనా అమ్మడితో ఓ అవార్డుల ఫంక్షన్‌లో ఆటాడించాలని ఓ సంస్థ  సంప్రదిస్తే దిమ్మతిరిగే  రేట్‌ చెప్పింది ముద్దుగుమ్మ . ఈ బ్యూటీ అడిగిన రేంజ్‌కు ఆ సంస్థ ఓకే చెప్పడంతో ఈవెంట్‌లో పాల్గొనేందుకు బ్యూటీ ఇండియా వస్తుందట. 

ఈ ఈవెంట్‌లో  కోసం బ్యూటీ అక్షరాల ఐదు కోట్లు తీసుకుంటుందట. జస్ట్‌  కొన్ని నిమిషాల పెర్ఫామెన్స్ కోసం ఐదు కోట్లు ఇస్తున్నారట.  తన ఆట పాట కోసం కోటి ఇచ్చేందుకు కూడా నిర్వాహకులు సైతం సై అనడంతో చిందేసేందుకు రెడీ అయిందట బ్యూటీ.  ప్రియాంక కున్న గ్లోబల్ ఇమేజ్, అంతర్జాతీయ మీడియాలోబ్యూటీకున్న ఫాలోయింగ్ కారణంగా అంత పారితోషికం ఇచ్చేందుకు  ఓ సంస్థ   ముందుకొచ్చిందట. రెండేళ్ల తరువాత ఈ బ్యూటీ బాలీవుడ్ వేడుకలో సందడి చేయనుండటంతో అమ్మడి పర్ఫామెన్సే... షోకు హైలెట్ గా నిలువనుంది.
 

English Title
Priyanka Chopra To Charge Rs 5 Crores To Perform

MORE FROM AUTHOR

RELATED ARTICLES