టీడీపీతో పొత్తుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Wed, 09/12/2018 - 11:32
Vijayashanti

టీడీపీతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీతో పొత్తు వద్దే వద్దన్నారు. తొలి నుంచి టీడీపీ పొత్తును వ్యతిరేకిస్తున్న ఆమె.. మరింత ఘాటుగా స్పందించారు. టీడీపీతో పొత్తు కాంగ్రెస్‌కు అవసరమా ? కాదా అన్న విషయాన్ని అధిష్టానం మరోమారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆ పార్టీతో పొత్తుపై తెలంగాణ ప్రజల్లో అభ్యంతరం ఉందన్నారు. ఈ నెల 15 తర్వాత నుంచి రాజకీయాల్లో మళ్లీ చురుకైన పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు.  

నిజానికి, తెలంగాణలో టీడీపీ-కాంగ్రెస్ పొత్తు ఉంటుందని తొలి నుంచీ వార్తలు వస్తున్నాయి. అయితే, ఇటీవల హైదరాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విషయాన్ని తెలంగాణ టీడీపీ నేతలకే వదిలేశారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా టీడీపీతో కలిసి ముందుకెళ్లేందుకు రెడీ అయ్యారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఇప్పటికే ఫలవంతమైన చర్చలు జరిగాయి. సీట్ల సర్దుబాటు విషయమే తేలాల్సి ఉండగా, తాజాగా విజయశాంతి మరోమారు అభ్యంతరం చెప్పడం చర్చనీయాంశమైంది.
 

English Title
Telangana Congress leader Vijayashanti responded on TDP, Congress alliance issue.

MORE FROM AUTHOR

RELATED ARTICLES