లైవ్‌లో మాట్లాడుతూ కన్నుమూత

Submitted by arun on Tue, 09/11/2018 - 10:27

మరణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు. మనతో మాట్లాడుతున్న మనుషులు ఇంకాసేపటి ఏం అవుతారో చెప్పేలేం. టీవీ షో లైవ్ షోలో మాట్లాడుతూ ప్రముఖ విద్యావేత్త, రచయిత ప్రొఫెసర్  రీటా జతీందర్(86) కుప్పకూలిపోయారు. ఏం జరుగుతుందో అర్థం కాకముందే ప్రాణాలు కోల్పోయారు. సోమవారం జరిగిన ఈ విషాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దూరదర్శన్‌ రీజినల్ ఛానల్‌లో ‘గుడ్‌ మార్నింగ్‌ జమ్మూకశ్మీర్‌’ అనే పాపులర్‌ లైవ్‌ షో నడుస్తోంది. హోస్ట్ జాహిద్ ముఖ్తర్. గెస్ట్ సీట్లో 86 ఏళ్ల రీటా జతిందర్‌. తన జీవిత గమనం గురించి, సాధించిన విజయాల గురించిన ప్రశ్నలకు జవాబులిస్తోంది. బాలీవుడ్ వెటరన్ స్టార్ దిలీప్ కుమార్‌కి సంబంధించిన ఒక ప్రశ్నకు జవాబిస్తూ.. వెక్కిళ్లు పెడుతూ ఒక్కసారిగా వెనక్కు వాలి పడిపోయింది. ఈ ఆకస్మిక ఘటనతో అవాక్కయిన సిబ్బంది దగ్గరికి వెళ్లి పరిశీలించి ఆమె మృతి చెందినట్లు గ్రహించారు. జతిందర్‌ మరణవార్త విని ఆమె అభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ”ఆమె నటిస్తోందని, దిలీప్ కుమార్‌ని అనుకరిస్తోందని భావించాను. ఆమె తన ఎదుటే ఇలా చనిపోవడం బాధాకరంగా వుంది” అంటూ ఆ క్షణాల్ని గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు హోస్ట్ ముఖ్తర్.
 

English Title
Guest on popular TV show dies during live telecast

MORE FROM AUTHOR

RELATED ARTICLES