ప్రశాంత్ కిశోర్ సంచలన ప్రకటన...

Submitted by arun on Mon, 09/10/2018 - 12:50
pk

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏ పార్టీతోనూ పనిచేయబోనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ విద్యార్థులతో ఆదివారం రాత్రి ఆయన ముచ్చటించారు. గత రెండేళ్లుగా ఈ ఫీల్డ్‌ను వదిలివేయాలని ఉందని చెప్పిన ప్రశాంత్ కిషోర్... తాను ప్రారంభించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐపాక్)సంస్థ బాధ్యతలను సమర్ధత ఉన్న వ్యక్తికి అప్పజెప్పాలని చూస్తున్నట్లు వివరించారు. గత ఆరేళ్లుగా తాను అనేక మంది ప్రముఖ నాయకులతో కలిసి పనిచేశానని ఇకపై తాను తొలిసారి పనిచేసిన గుజరాత్ లేదా నా సొంత రాష్ట్రం బీహార్‌కు కాని వెళతానని ప్రశాంత్ తెలిపారు. 2014లో నాటి బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ అధికారంలోకి రావడంలో ప్రశాంత్ కిశోర్ కీలక పాత్ర పోషించారు. 

English Title
Prashant Kishor will not campaign for any party in 2019 Lok Sabha polls

MORE FROM AUTHOR

RELATED ARTICLES