అక్టోబరులో షెడ్యూల్‌... నవంబర్‌లో ఎలక్షన్స్‌? ఈసీ డిసైడైందా?

Submitted by santosh on Mon, 09/10/2018 - 11:46
election commission of india telangana

తెలంగాణ అసెంబ్లీకి నాలుగు రాష్ట్రాల ఎన్నికల కన్నా ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ రెండోవారంలో షెడ్యూల్ విడుదల కానున్నట్లు సమాచారం వస్తోంది.. అప్పటి నుంచి 45 రోజులలో, నవంబరు చివరి వారంలో పోలింగ్‌ జరగవచ్చు. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలను వేగవంతం చేసింది. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నవంబరులోనే జరగనున్నట్లు తెలుస్తోంది.. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల్లోనే ఓటింగ్‌ యంత్రాలు రాష్ట్రానికి రానున్నాయి. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ గడువును కూడా ఈసీ కుదించింది. అక్టోబరు ఎనిమిదో తేదీనాటికే ఓటర్ల తుది జాబితా సిద్ధమవుతుందని ఈసీ ప్రకటించింది. అంటే అక్టోబరు ఎనిమిదో తేదీ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సిద్ధంగా ఉన్నట్లు ముందస్తు సమాచారం ఇచ్చింది. 

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సవరణకు జనవరి నాలుగో తేదీని గడువుగా నిర్ణయించింది. తెలంగాణ కూడా ఆ జాబితాలో ఉంది. దాని ప్రకారం సవరణ ప్రక్రియ ఇటీవలే ప్రారంభమైంది. అయితే అసెంబ్లీ రద్దు పరిణామాల నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన ఓటర్ల జాబితా సవరణ గడువును ఈసీ సవరించి, కొత్త షెడ్యూలు విడుదల చేసింది. దీని ప్రకారం ఈనెల 10న ప్రకటించే ముసాయిదా జాబితాలో పేరు లేని ఓటర్లు కొత్తగా నమోదు చేసుకోవచ్చు. నాలుగు రాష్ట్రాలతో కలిపి తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని ఇప్పటి వరకూ భావించారు. కానీ అన్నీ కుదిరితే వాటి కంటే ముందే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాల పరిమితి కంటే ముందే అసెంబ్లీ రద్దయితే, తొలి ప్రాధాన్యమిచ్చి మరీ ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరపాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలే దీనికి కారణమని చెబుతున్నారు. ఇదే విషయాన్ని సీఈసీ రావత్‌ స్పష్టం చేశారు కూడా.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా వీవీ ప్యాట్‌ యంత్రాలను ఉపయోగించనున్నారు. తెలంగాణకు 84,400 వీవీ ప్యాట్‌లు అవసరమని ఇప్పటికే నిర్ణయించారు. సెప్టెంబరు చివరినాటికి వీటిని సిద్ధం చేయనున్నారు. ఈ క్రమంలో భెల్‌లో సిద్ధంగా ఉన్న 44 వేల యంత్రాలను నాలుగు రోజుల్లోనే రాష్ర్టానికి తీసుకురావాలని, ఈవీఎంలు తరలించే వాహనాలకు ట్రాకింగ్‌ సిస్టమ్‌ను సమకూర్చాలని తెలంగాణ సీఈవోను ఈసీ ఆదేశించింది. మొత్తానికి తెలంగాణ ఎన్నికల కన్నా ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుండటంతో.. అన్ని పార్టీలూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. 

English Title
election commission of india telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES