‘అందుకే సురేశ్‌ రెడ్డి పార్టీ వీడారు’

Submitted by arun on Sat, 09/08/2018 - 10:06
madhu yashki

మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి వెళ్తే తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కాంగ్రెస్‌ సీనియర్ నాయకుడు మధుయాష్కి తెలిపారు. సిట్టింగ్ స్పీకర్‌గా ఉండి కూడా తర్వాతి ఎన్నికల్లో గెలవలేని వ్యక్తిని టీఆర్ఎస్‌ స్వాగతించిందంటే ఆ పార్టీ గెలుపోటములు సూచిస్తున్నాయని.. మదుయాష్కి ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే సురేశ్‌ రెడ్డి పార్టీ ఎందుకు మారాల్సి వచ‍్చిందో మధుయాష్కీ స్పష్టం చేశారు. సురేష్‌ రెడ్డికి టికెట్‌ ఇ‍వ్వకూడదని ఆలోచిస్తున్నామని, అందుకే ఆయన పార్టీ మారాడన్నారు.  మురికి నీరు కొట్టుకుపోతే, కొత్త నీరు వస్తుందంటూ సురేష్‌ రెడ్డి పార్టీ మారడాన్ని ఎద్దేవా చేశారు. తమ పార్టీలో చేరడానికి అనేకమంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల‍్సీలు సిద్ధంగా ఉన్నారన్నారు. అసలు టీఆర్‌ఎస్‌ వంద సీట్లు గెలిచే ధైర్యం ఉంటే ఇతర పార్టీ నేతల కాళ్ల మీద ఎందుకు పడుతున్నారంటూ మధుయాష్కీ మండిపడ్డారు. 

English Title
madhu yashki fire on kr suresh reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES