ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారైందా?

Submitted by arun on Wed, 09/05/2018 - 15:56
telangana cabinet

ముందస్తు ఎన్నికలకు ఇక ముహూర్తం ఖరారే,

ఇగ రాష్టంలోని  రాజకీయ నిర్ద్యోగులంతా హుషారే,

పైసలు పంచడాలు, మందులో ముంచడాలు షురురే,

ఎన్నికలంటే ఎవరికి వచ్చెనో పండగలాగా మహా పబ్బారే. శ్రీ.కో. 

ఈనెల 6వ తేదీ ఉదయం 6.45 నిముషాలకు ఆయన మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈమేరకు మంత్రులందరికీ సమాచారం పంపారట. అదేరోజు ఆయన అసెంబ్లీ ని రద్దు చేస్తూ, గవర్నర్‌ను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. దీన్ని దృవీకరిస్తూ మంగళవారం ప్రభు త్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషీ, రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి రజత్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ తదితరులు గవర్నర్‌ను కలిశారు. గవర్నర్‌తో అధికారుల భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

English Title
telangana cabinet dissolve assembly sep-6

MORE FROM AUTHOR

RELATED ARTICLES