ప్రచారం ఊపందుకుంటుంది ఉద్యమంలా!

Submitted by arun on Wed, 09/05/2018 - 15:46
Telangana

ఎన్నికల ప్రచారం ఊపందుకుంటుంది ఉద్యమంలా,

ఇక అన్ని పార్టీలు ప్రచార ప్రణాలికల్లో మునిగాయిలా,

ఒకరు 50 రోజుల్లో 100 బహిరంగ సభలు చేస్తాం యిలా,

అని అంటే, మరొకరు మీము మీకన్నా తక్కువనా యెలా,

అని దూకుడు  పెంచాసాగిరి. శ్రీ.కో. 


ఎన్నికల ప్రచారంలో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల్లో 100 బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార ప్రణాలికల్లో మునిగాయి.  ఈనెల 7న హుస్నాబాద్‌లో సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు, సభా స్థలాన్ని మంత్రలు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావు, ఎంపీ వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ పరిశీలించారు. నాలుగేళ్లలో తెరాస ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేయడమే ప్రధాన ఉద్దేశంగా సభలు నిర్వహించనున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. సీఎం బహిరంగ సభకు ''ప్రజల ఆశీర్వాద సభ'గా నామకరణం చేసినట్లు తెలిపారు.
 

Tags
English Title
Political Heat in Telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES