సొంత థియేటర్లు కట్టనున్న మహేష్ బాబు : మెదటి సినిమా ఆయనదే

Submitted by admin on Wed, 09/05/2018 - 14:57

సౌత్ ఇండియాలో నెంబర్ వన్‌ సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యునరేషన్ విషయంలో అసలు తగ్గడం అనేది ఉండదు.తన భార్య నమ్రత సాయంతో పలు బిజినెస్‍లు,యాడ్‌ఫిల్మ్స్ రూపంలో బాగానే సంపాదిందుస్తుంటాడు.ఒక రకంగా ఈ సుపర్ స్టార్ మంచి బిజినెస్ మెన్ కూడా అని చెప్పవచు.

ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో దిగి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బూమ్ ఉంటే అక్కడ అనేక స్థలాలను కొనేశాడు మహేష్.ఇప్పుడు మహేష్ మరో ముందడుగు వేసి మల్టీప్లెక్స్ ల నిర్మాణంలోకి అడుగుపెట్టబోతున్నాడు.ఇప్పటికే గచ్చిబౌలీ ఏరియాలో ఏషియన్ సినిమాస్ వారితో కలసి ఒక మల్టీప్లెక్స్ నిర్మాణాన్ని జరుపుతున్నాడు అనేది సినీ వర్గాల టాక్.

ఒక వేళ ఇది కనుక సక్సెస్ అయితే భారీ స్థాయిలో ఈ రంగంలోకి అడుగుపెట్టి విజయవాడ,విశాఖపట్నంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ నగరాలకి తన వ్యాపారాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాడు మహేష్.తన తదుపరి సినిమా నాటికి దీన్ని పూర్తి చేసి తన్ సొంత సినిమాను ,సొంత ధియేటర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడూ బాబూ.

 

English Title
super star mahesh babu to enter into multiplex construction

MORE FROM AUTHOR

RELATED ARTICLES