టీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఊరట

Submitted by arun on Fri, 08/31/2018 - 12:35
trs

టీఆర్‌ఎస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ప్రగతి నివేదన సభపైదాఖలైన పిటిషన్‌ను  హైకోర్టు కొట్టివేసింది. పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగేలా సభను నిర్వహిస్తున్నారంటూ న్యాయవాది శ్రీధర్ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ అడ్వకేట్ జనరల్ కోర్టుకు విన్నవించారు. అయితే లక్షలాది మంది ఒకే చోటుకు రావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయంటూ పిటీషనర్ అభ్యంతరం లేవనెత్తారు. ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామంటూ ..సభ ఏర్పాట్లను అడ్వకేట్ జనరల్ వివరించారు. దీంతో సంతృప్తి చెందిన న్యాయస్ధానం  ప్రజలకు అసౌకర్యం కలగకుండా సభ జరపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ  పిటీషన్‌ను కొట్టివేసింది. 
 

English Title
high courtPragathi Nivedana Sabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES