ఆ నెంబర్ నందమూరి ఫ్యామిలీపై పగబట్టిందా..?

Submitted by arun on Thu, 08/30/2018 - 12:21

ఆ నెంబర్ నందమూరి ఫ్యామిలీపై పగబట్టిందా..? సంఖ్యలు మృత్యురూపంలో వారిని వెంబడించాయా..? నాలుగేళ్ల క్రితం ఓసారి.. నేడు మరోసారి నందమూరి వారింటిని శోకసంద్రంలోకి తోసింది ఆ సంఖ్యలేనా..? నెంబర్ సెంటిమెంట్ ఎక్కువగా పాటించే నందమూరి వారసులను వెంటాడిన ఆ సంఖ్యలేంటి...? 

హరికృష్ణ  నిన్న ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న వార్త తెలుగు ప్రజలను శోకసంద్రంలో ముంచివేసింది. నెల్లూరు రుకి వెళ్తున్న హరికృష్ణ నల్గొండ జిల్లా నార్కట్ పల్లి-అద్దంకి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం హరికృష్ణ కుమారుడు జానకీ రామ్ కూడా కారు నడుపుతూనే రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. ఈ రెండు ప్రమాదాలు ఉమ్మడి నల్గగొండ జిల్లాలోనే జరిగాయి.

వీరిద్దరి మరణంలోనూ సామీప్యత ఉంది. ఇద్దరూ నల్గొండ జిల్లాలోనే మృతి చెందారు మరోవైపు హరికృష్ణ, జానకీరామ్‌లు వాడిన రెండు కార్ల నంబర్లు ఒక్కటే కావడం అందరినీ షాక్ కు గురిచేసింది. వాహనాలు వేరు అయినా వారి వాహనాల నంబర్లు మాత్రం 2323 సిరీస్ లోనే ఉండడం అందరినీ షాకింగ్ కు గురి చేస్తోంది 

హరికృష్ణ నడుపుతూ ప్రమాదానికి గురైన కారు నంబర్ AP 28 BW 2323 కాగా.. జానకీరామ్ ప్రమాదానికి గురైన కారు నంబర్ AP 29 BD 2323. యాక్సిండెంట్లకు గురైన ఈ రెండు కార్లూ ఒకటే కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. ఇది యాదృశ్చికమో లేక విధిరాతో అని ప్రజలు అనుకుంటున్నారు. 

English Title
Nandamuri Hari Krishna and His Son Janaki Ram Road Mishaps Same Car Reg Numbers

MORE FROM AUTHOR

RELATED ARTICLES