ఏపీలో మరో రాజకీయ పార్టీ...

Submitted by arun on Fri, 08/24/2018 - 09:43
Araku MP

నవ్యాంధ్రలో మరో కొత్త పొలిటికల్ పార్టీ పురుడుపోసుకోబోతోంది. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఏర్పాటు చేయబోతోన్న ఈ పార్టీని ఈ ఉదయం 11.30 గంటలకు ప్రకటిస్తారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత తాను శుక్రవారం కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఉదయం 11.30 గంటలకు విజయవాడ బెంజ్ సర్కిల్‌లోని జ్యోతి కన్వెన్షన్ హాల్లో పార్టీని ప్రారంభించి, వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొందిన గీత.. ఆ తర్వాత వైసీపీకి దూరమవుతూవచ్చారు. టీడీపీలో చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ అది జరగలేదు. చాలా కాలంగా స్వతంత్రంగా వ్యవహరిస్తోన్న ఆమె ఇప్పుడు కొత్త పార్టీపెట్టి ఏపీలో సరికొత్త రాజకీయానికి తెరతీయబోతుండటం విశేషం.

English Title
Andhra Pradesh: Araku MP to float new party

MORE FROM AUTHOR

RELATED ARTICLES