కేరళ వర్షాలపై నాసా శాటిలైట్ వీడియో

Submitted by arun on Thu, 08/23/2018 - 12:53

నైరుతి రుతు పవనాల ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే కేరళ అతలాకుతలమైందని నాసా తేల్చింది. ఈ మేరకు భారత దేశవ్యాప్తంగా వర్షపాతాన్ని లెక్కిస్తూ ఉపగ్రహాన్ని ఉపయోగించి తీసిన వీడియోను విడుదల చేసింది. భారత్‌లో ఇది వర్షాలకు అనుకూల సమయమన్న నాసా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కేరళలో ఎడతెరపి లేకుండా వందల సెంటీమీటర్ల వర్షం కురిసిందని తెలిపింది.

ఈ నెల 13 నుంచి 20 వరకు భారత్‌లో కురిసిన వర్షపాతాన్ని నాసా రెండు భాగాలుగా విభజించింది. మొదటి భాగంలో ఉత్తర భారతదేశంలోని సరిహద్దుల మీదుగా సుమారు 5సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక రెండోది పశ్చిమాన ఉన్న తూర్పు బంగాళాఖాతం వెంబడి 14అంగుళాల వర్షపాతం నమోదైంది. మొదటి వర్గాన్ని సాధారణంగా వచ్చే వర్షపాతంగానే లెక్కగట్టిన నాసా రెండోది మాత్రం ఎన్నడూ లేని విధంగా అక్కడ అల్పపీడనం నమోదైనట్లు చెప్పింది. అల్పపీడనం తీవ్రత మొత్తం తీర ప్రాంతమైన కేరళపై పడటంతో ఎక్కువ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా కేరళ అతలాకుతలమైనట్లు వివరించింది. 
 

English Title
NASA tracks the rain behind Kerala floods

MORE FROM AUTHOR

RELATED ARTICLES