‘బిగ్‌బాస్’ విన్నర్ అతనే... లేదంటే ధర్నాలే..: రష్మి

Submitted by arun on Thu, 08/23/2018 - 11:55

బిగ్‌బాస్‌ సీజన్‌-2 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ గొడవలతో సోషల్‌ మీడియాలో ఓ ట్రెండ్‌ సృష్టించింది ఈ రియాల్టీ షో. ఆసక్తికర టాస్క్‌లు, సెలబ్రిటీల సడన్‌ ఎంట్రీలతో బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు సర్‌ప్రైజ్‌ ఇస్తున్నాడు. బిగ్‌బాస్ విన్నర్ గురించి యాంకర్ రష్మి తన అభిప్రాయాన్ని తెలిపింది.‘బిగ్‌బాస్ సీజన్ 2’ టైటిల్ పక్కా కౌశల్‌దే!...’’ అని కరాకండిగా చెప్పేస్తోంది యాంకర్ రష్మీ. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హాట్ యాంకర్, వరుస సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె హీరోయిన్‌గా నటించిన ‘అంతకు మించి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్న రష్మీ, తాజాగా ‘బిగ్‌బాస్’ కార్యక్రమం గురించీ, టైటిల్ గెలిచే పార్టిసిపెంట్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ‘బిగ్‌బాస్’ కార్యక్రమం చూడను కానీ వింటూ ఉంటానని చెప్పిన రష్మీ, నందినీ రాయ్, కౌశల్, గీతామాధురి వంటి వాళ్లతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పింది.

గీత నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఫీడ్స్‌లో కానీ కొన్నింటిలో చూస్తూ ఉంటాం కాబట్టి బిగ్‌బాస్ గురించి తెలుస్తూ ఉంటుంది. కానీ నేను ఫాలో అవను. అసలు బిగ్‌బాస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏదైనా జరిగిందో లేదో వెంటనే ఇన్‌స్టాగ్రాంలో, ట్విటర్‌లో వచ్చేస్తూ ఉంటుంది. వెంటనే అప్‌డేట్స్ వస్తూనే ఉంటాయి. మన ఢీలో కూడా ఈరోజు విన్నింగ్ అయింది. ఎపిసోడ్ టెలికాస్ట్‌కి ముందే తెలిసిపోతుంది. కౌశల్ ఆర్మీని ట్విటర్‌లో చూస్తుంటా. ఇప్పుడు చూసినంత వరకూ వన్‌సైడెడ్‌గా అయిపోయింది. కౌశలే విన్ అవుతాడని అనిపిస్తోంది. కౌశల్ ఆర్మీ అని చూస్తుంటాం. కౌశల్ ఆర్మీ చాలా చాలా స్ట్రాంగ్. చాలా ఫీడ్స్, పోస్ట్స్, వీడియోస్ చేసి పెట్టడం చూస్తుంటే వన్‌సైడెడ్‌గా అనిపిస్తోంది. కౌశల్ ఒకవేళ గెలవకపోతే ధర్నాలు అయిపోతాయి’’ అని చెప్పుకొచ్చింది రష్మి.
 

English Title
Jabardasth Rashmi About Kaushal Army- Bigg Boss 2

MORE FROM AUTHOR

RELATED ARTICLES