విజయ్ దేవరకొండ మరొక పవర్ స్టార్ !

Submitted by arun on Mon, 08/20/2018 - 12:43
dr

ఈ మధ్య కాలంలో మన ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయిన హీరో విజయ్ దేవరకొండ.  'పెళ్లి చూపులు'తో మొదలైన ఇతగాడి హడావుడి 'అర్జున్ రెడ్డి'తో ఊపందుకుని తాజాగా విడుదలైన 'గీత గోవిందం'తో తారా స్థాయికి చేరుకుంది.  ఎప్పటికప్పుడు తన నటనతో, యాటిట్యూడ్ తో యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు విజయ్. నిన్న జరిగిన 'గీత గోవిందం' ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ...ఈ 15 ఏళ్లలో ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ, రామ్ చరణ్ అందరూ స్టార్లు అయ్యారని... 20 ఏళ్ల క్రితం 'తొలిప్రేమ' సినిమాతో యూత్ ను పవన్ కల్యాణ్ షేక్ చేశారని... ఇప్పుడు తనకు విజయ దేవరకొండ అలా కనిపిస్తున్నాడని దిల్ రాజు అన్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా ఎదిగాడని... చిరంజీవిలాంటి వారి ఆశీస్సులు విజయ్ కు ఉన్నాయని చెప్పారు.
 

English Title
vijay devarakonda is another powerstar says dil raju

MORE FROM AUTHOR

RELATED ARTICLES