ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ మృతి

Submitted by nanireddy on Sat, 08/18/2018 - 20:41
kofi-annan-former-un-secretary-general-dies

ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్‌ కోఫీ అన్నన్‌ మృతిచెందారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అయన శనివారం తుదిశ్వాస విడిచారు. జనవరి 1, 1997 నుంచి డిసెంబరు 31, 2006 వరకూ పదేళ్ళపాటు ఐక్యరాజ్య సమితికి తన సేవలను అందించారు. ఘనా దేశంలో జన్మించిన కోఫీ అన్నన్‌ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆఫ్రికా ఖండం నుంచి ఐరాసకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. సిరియాకు యూఎన్ ప్రత్యేక రాయబారిగా సేవలందించారు. ఆ క్రమంలో సిరియా యుద్ధానికి శాంతియుత పరిష్కారం కల్పించే దిశగా ప్రయత్నాలు చేశారు. ఇరాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ విజృంభిస్తున్న రోజుల్లో అన్నాన్ ఐరాస చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించారు.

English Title
kofi-annan-former-un-secretary-general-dies

MORE FROM AUTHOR

RELATED ARTICLES