తెలుగు నేలకు వాజ్‌పేయికి విడదీయరాని అనుబంధం

Submitted by arun on Fri, 08/17/2018 - 08:42
atal

భరతమాత ముద్దుబిడ్డ వాజ్‌పేయికి.. తెలుగు రాష్ట్రాలకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆనాటి ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా నిలిచిన హైటెక్ సిటీ అయినా హైదరాబాద్‌లో విమానయానానికి కేరాఫ్‌ శంషాబాద్‌ విమానాశ్రయానికి బీజం పడ్డా అదంతా వాజ్‌పేయి హయాంలోనే. పుట్టపర్తిలో పేద రోగులకు వైద్యాన్ని అందిస్తున్న సత్యసాయి అంతర్జాతీయ ఆస్పత్రిని కూడా తానే ప్రారంభించారు. 

మహోన్నత రాజకీయ శిఖరం వాజ్‌పేయికి అప్పటి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఇక్కడి రాజకీయాలతో సంబంధం ఉంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం మద్దతు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడి రాజకీయాలపై వాజ్‌పేయికి ప్రత్యేక అనుబంధం పెంచుకున్నారు. 

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో అడుగులు పడుతున్న సమయంలోనే ఐటీలో మేటీగా మారిన మన హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది. దానికి గుర్తుగా నిర్మించిన సైబర్‌ టవర్స్‌ను నిర్మించిన సందర్భంగా దాన్ని ప్రారంభించేందుకు అప్పటి ప్రధాని వాజ్‌పేయి హైదరాబాద్‌కు వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, అప్పటి కేంద్రమంత్రి దత్తాత్రేయ తదితరులు భాగ్యనగరానికి వచ్చారు. 

మరోవైపు ఎంతోమంది క్యాన్సర్‌ బాధితులకు చికిత్స అందిస్తున్న బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిని 2000 వ సంవత్సరం జూన్ 22 న వాజ్‌పేయి ప్రారంభించారు. ఆ సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన్ను బాలకృష్ణ కలిశారు. ఆయనతో ఉన్న అప్పటి అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి టీడీపీ క్రియాశీలకంగా వ్యవహరించిందని బాలయ్య బాబు గుర్తు చేసుకున్నారు. 

ఆధ్యాత్మిక వేత్త పుట్టపర్తి సాయిబాబాను కూడా వాజ్‌పేయి దర్శించుకున్నారు. అనంతపురం జిల్లాకు వచ్చిన ఆయన పుట్టపర్తిలో సాయిబాబా అంతర్జాతీయ ఆస్పత్రిని 2001 జనవరిలో ఆయన చేతుల మీదుగానే ప్రారంభించారు. పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న సాయిబాబాను అభినందించారు. ఇటు ఎన్టీఆర్‌ నుంచే బీజేపీతో సత్సంబంధాలు పెంచుకున్న తెలుగుదేశం చంద్రబాబు హయాంలో అవి మరింత బలపడ్డాయి. వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం కారణంగానే చంద్రబాబు సూచన మేరకు అటల్‌జీ కేంద్రంలో కూడా ముందస్తుకు వెళ్లారు. 

English Title
atal bihari vajpayee relation with andhra pradesh

MORE FROM AUTHOR

RELATED ARTICLES