ఎయిమ్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

Submitted by arun on Thu, 08/16/2018 - 14:20
Narendra Modi,

మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఎయిమ్స్‌కు చేరుకున్నారు. వాజ్‌పేయి పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందంటూ ఎయిమ్స్‌ వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు. వాజ్‌పేయీ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలియడంతో మోదీ నిన్న రాత్రే ఎయిమ్స్ కు చేరుకుని ఆయన్ని పరామర్శించారు. సుమారు 50 నిమిషాల పాటు అక్కడే ఉన్నారు. అయితే వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణిస్తోందని వైద్యులు ఈరోజు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయడంతో మోదీ మరోసారి ఆస్పత్రికి చేరుకుని వాజ్‌పేయీని పరామర్శించారు.
 

English Title
Narendra Modi, Amit Shah at AIIMS as Former PM Remains Critical

MORE FROM AUTHOR

RELATED ARTICLES