అక్కడ మనుషులు కాదు... మంకీలే వెయిటర్స్

Submitted by arun on Mon, 08/13/2018 - 15:57

ఆ రెస్టారెంట్‌లోకి వెళ్లాలని కస్టమర్స్‌ ఉత్సాహం చూపిస్తారు. లేట్‌ అయినా పర్లేదు ఇంకా చెప్పాలంటే అక్కడ తినకున్నా ఏం కాదు కానీ రెస్టారెంట్‌లోకి అడుగుపెడితే చాలని కోరుకుంటారు. ఆ హోటల్‌ ముందు క్యూ కడతారు. ఏంటా స్పెషల్‌. ఎందుకంటే అక్కడ వెయిటర్లు ఉండవ్‌. ఉన్న వెయిటర్స్‌ ఓన్లీ మంకీస్‌. అదే స్పెషల్‌. 

జపాన్‌ టోక్యోలోని కయాబుకియా టావెర్న్‌ రెస్టారెంట్‌లో అన్నీ మంకీ వెయిటర్సే. అక్కడ వెయిటర్స్‌గా కోతులే పని చేస్తాయి. అడిగిందే తడువుగా ఆర్డర్‌ను తీసుకొచ్చేస్తాయ్. అక్కడ తినేవారికి వినోదమనేది మినిమమ్‌ గ్యారెంటీ. ఈ రెస్టారెంట్‌లో యట్‌ చాన్‌, ఫకు చాన్‌ అనే రెండు కోతులు పని చేస్తున్నాయి. రెస్టారెంట్‌లోకి అడుగుపెట్టేవారికి సాదరంగా కోతులు స్వాగతం పలుకుతాయ్. ఎవరైనా కస్టమర్‌ ఆశ్చర్యపోయి ఆ కోతుల వైపు ఆసక్తిగా చూస్తే బాల్‌మీద నడవటం, ఫోజులు కొట్టడం చేస్తూ ఆతిథ్యంలోనే కాస్త వెరైటీ ఫన్‌ను ఇస్తాయ్. 

ఈ రెండు కోతులకూ రెస్టారెంట్‌ యజమాని మాస్కులు వేయిస్తాడు. ఒక్కో రోజు ఒక్కో గెట్‌పలో ప్రత్యక్షమవుతాయ్. టై కట్టుకని వెయిటర్‌ జాబ్‌ను పక్కాగా నిర్వర్తిస్తాయ్. యట్‌ చాన్‌ రెస్టారెంట్‌లోని టేబుల్‌ మధ్య చకచకా పరుగెడుతుంది. కస్టమర్స్‌ అడిగిన ఫుడ్‌తో పాటు బీర్‌, ఇతర డ్రింక్‌లను స్పీడ్‌గా సప్లై చేస్తుంది. 

కస్టమర్స్‌ తినటం అయిపోయాక చేతులు శుభ్రపరచుకోవటానికి హాట్‌ టవల్‌ను తీసుకొచ్చి మరీ ఇస్తుంది ఫకు చాన్‌. దాని హాస్పిటాలిటీ చూస్తే ఎవరైనా ముగ్ధులవ్వాల్సిందే. రెస్టారెంట్‌లో ఉండే ఈ జంట వెయిటర్స్‌ను చూడటానికే ఎక్కువ మంది వస్తుంటారు. ఇతర దేశాలవారూ తెల్సుకుని మరీ ఆ రెస్టారెంట్‌లోకి వెళ్తుంటారు. వీలైతే రెండు సెల్ఫీలు, నాలుగుఫోజులు కొడతాయి ఈ మంకీ వెయిటర్స్‌. 

మా పిల్లలే చెప్పిన మాట వినరు.. అలాంటిది ఇక్కడ కోతులు భలే వింటున్నాయంటూ కస్టమర్లు ముచ్చటపడటం ఇక్కడ కామన్‌. కొందరి మనుషుల కంటే ఇవి చాలా నయమంటూ కస్టమర్లు తెగ సంబరపడిపోతుంటారు. ఈ వెయిటర్స్‌కు టిప్‌గా పండ్లు, సోయా బీన్స్‌ ఎక్కువగా కస్టమర్స్‌ ఇస్తుంటారు. ఎందుకంటే వాటికి సోయాబీన్స్‌ అంటే చాలా ఇష్టం. 

మొత్తానికి కోతులే వెయిటర్స్‌గా ఉండటం అద్భుతమైన మార్కెటింగ్‌ స్ట్రాటజీ. ఆ కోతులవల్లే కయాబుకియా రెస్టారెంట్‌ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. యజమాని కవోరు వస్తుకా ఓ రోజు రెస్టారెంట్‌లో పని చేస్తుంటే తన పెంపుడు కోతులు అనుకరించాయట. అందుకే వాటిని వెయిటర్స్‌గా తీసుకోవాలనే ఆలోచన ఆయనకు వచ్చిందట. చాన్‌ జోడీ తర్వాత వాటికి పుట్టిన మూడు పిల్లకోతులు ఆ రెస్టారెంట్‌లో వెయిటర్స్‌గా పనిచేస్తాయట. ఇందుకోసం ట్రైనింగ్‌ అవుతున్నాయి కూడా.
 

English Title
Monkey waiters in japan restaurant

MORE FROM AUTHOR

RELATED ARTICLES