విమానాన్ని ఎత్తుకెళ్లిన ఉద్యోగి

Submitted by arun on Sat, 08/11/2018 - 15:08
Alaska Airlines

మీరెప్పుడైనా బైక్‌ చోరీ గురించి వినుంటారు లేదా కారు ఎత్తుకుపోయారనే కేసులు చూసుంటారు మహా అయితే బస్సు లేక లారీని ఎత్తుకెళ్లడం వినుంటాం కానీ భారీ విమానం చోరీకి గురవడం మీరెప్పుడైనా చూశారా?. అగ్రరాజ్యం అమెరికాలో ఇదే జరిగింది. ఓ విమానయాన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి ఉన్నట్టుండి విమానాన్ని ఎత్తుకెళ్లి ఆకాశంలో షికార్లు కొట్టాడు. ఖాళీ విమానంతో గగనతలంలోకి వెళ్లిన ఉద్యోగి ఆపై దాన్ని కంట్రోల్‌ చేయలేక చేతులెత్తేశాడు. దాంతో విమానం ఒక్కసారిగా కుప్పకూలింది.

శుక్రవారం రాత్రి వాషింగ్టన్‌లో జరిగిన ఈ ఘటనతో అగ్రరాజ్యం అమెరికా వణికిపోయింది. విమానం సడన్‌గా గగనతలంలోకి రావడంతో అసలేం జరుగుతుందో తెలియక కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. టాప్‌ అఫీషియల్స్‌ అంతా ఉరుకులు పరుగులు పెట్టారు. ఉగ్రవాద చర్యగా భావించి విమానాన్ని కూల్చేందుకు యుద్ధ విమానాలను రంగంలోకి దింపారు. అనుమతి లేకుండా ఎగురుతోన్న విమానాన్ని వెంబడించాయి.

వాషింగ్టన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అలస్కా ఎయిర్‌లైన్‌కు చెందిన ఓ విమానం టేకాఫ్‌ అయ్యింది. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా టేకాఫ్‌కు అనుమతి తీసుకోకుండా విమానం బయల్దేరడంతో అధికారులు కంగుతిన్నారు. వెంటనే అప్రమత్తమై రెండు అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ జెట్‌ విమానాలతో అలస్కా విమానాన్ని ఛేజ్‌ చేశారు. అయితే అంతలోనే కెట్రాన్‌ ద్వీపం దగ్గర విమానం కుప్పకూలింది.

విమానం కుప్పకూలడంతో అమెరికా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అలాస్కా ఎయిర్‌ లైన్స్‌కు చెందిన ఓ మెకానిక్‌ ఈ చర్యకు పాల్పడ్డట్టు గుర్తించారు. విమానంలో అతను తప్ప ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. విమనాన్ని కొంతదూరం తీసుకెళ్లగలిగిన మెకానిక్‌ ఆ తరువాత కంట్రోల్‌ చేయలేకపోవడంతో క్రాష్‌ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనతో ఉగ్రవాదులకు ఎలాంటి సంబంధం లేదని ఎయిర్‌ లైన్స్‌ అధికారులు ప్రకటించారు. క్రాషైన ఫ్లైట్‌ 76 సీట్ల సామర్థ్యం గల విమానం అని, ఆత్మహత్య చేసుకునేందుకు అతను ఇలా చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.

English Title
Man steals plane and crashes after chase with fighter planes in Seattle

MORE FROM AUTHOR

RELATED ARTICLES