సచిన్ కు నిద్రలో నడిచే అలవాటు ఉంది.. రాత్రిళ్లు గదంతా తిరిగి....  

Submitted by arun on Mon, 08/06/2018 - 16:11
sachin

క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లస్టర్  సచిన్ టెండూల్కర్ కు నిద్రలో లేచి అలవాటు ఉందని దాదా, సౌరభ్ గంగూలి తెలిపారు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. టెస్టులకు కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు గంగూలి. ఈ సందర్భంగా  ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్’ కార్యక్రమంలో భాగంగా దాదా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.  ముఖ్యంగా గతంలో క్రికెటర్ గా ఇంగ్లండ్ టూర్ లో ఉన్నప్పుడు సచిన్ కు, తనకు మధ్య జరిగిన ఓ  సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు గంగూలి.

 ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నప్పుడు సచిన్ తనను భయపెట్టేవాడన్నారు గంగూలి. ‘ సచిన్ కు నిద్రలో లేచి నడిచే అలవాటు ఉంది. మొదట్లో అది చూసి నేను భయపడే వాడిని. ఇంగ్లండ్ టూర్ లో ఉన్నప్పుడు సచిన్, నేను, మరికొందరు ఒకే రూమ్ లో ఉండేవాళ్లం. ఓ రోజు సచిన్ నిద్రలో నడుస్తుంటే చూశా. బాత్రూమ్ కు వెళ్లాడనుకున్నా. అయితే అలా ప్రతీ రోజు రాత్రి నిద్రలో లేచి నడిచేవాడు. అతను ఎక్కడి కెళ్తున్నాడో తెలుసుకునేందుకు.. ఓ రోజు మెలకువతో ఉన్నా. రాత్రి 1:30గంటల సమయంలో సచిన్ నిద్రలేచాడు. గదంతా తిరిగాడు. కుర్చీలో కూర్చున్నాడు. ఆ తర్వాత నా పక్కకి వచ్చి నిద్రపోయాడు.’ అంటూ అప్పటి సంఘటనను గుర్తు చేస్తూ.. నవ్వుకున్నాడు గంగూలి...

English Title
Sachin Tendulkar was a sleepwalker, reveals Sourav Ganguly

MORE FROM AUTHOR

RELATED ARTICLES