వివాహేతర సంబంధం...నాలుగేళ‌్ల బాలుడిని గొంతు నులిమి చంపిన మహిళ

Submitted by arun on Wed, 08/01/2018 - 10:56

నెల్లూరు జిల్లాలో మానవత్వం మంటగలిసింది. పెద్దల మధ్య ఏర్పడిన అనాలోచిత వివాహేతర సంబంధం ముచ్చుపచ్చలారని చిన్నారి ప్రాణాలను బలిగొంది. బాలాజీరావుపేటకు చెందిన రత్నమ్మ అనే మహిళ నాలుగేళ్ల బాలుడిని గొంతు నులిమి దారుణంగా హత్య చేసింది.  బాలుడి తండ్రితో గతంలో రత్నమ్మకు వివాహేతర సంబంధం ఉండేది. అయితే ఈ విషయం ఇంట్లో తెలియడంతో గత కొద్ది కాలంగా రత్నమ్మకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో కాలనీలో ఎవరూ లేని సమయంలో బాలుడిని ఇంట్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపిన రత్నమ్మ  ఇంట్లోనే గోనె సంచిలో దాచి ఉంచింది. బాలుడు కనిపించకపోవడంతో పోలీసులు తల్లిదండ్రులు ఆశ్రయించారు. దీంతో గ్రామంలో సోదాలు నిర్వహిస్తుండగా రత్నమ్మ ఇంట్లో బాలుడి మృతదేహం బయటపడింది.  బాలుడిని మృతుని తట్టుకోలేని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.  

English Title
ratnamma arrested for killing four years boy in nellore

MORE FROM AUTHOR

RELATED ARTICLES