యజమాని ప్రాణాలకు.. తన ప్రాణాలు అడ్డుపెట్టింది

Submitted by arun on Tue, 07/24/2018 - 13:38
dog

లయన్స్‌తో  పోరాడి యజమాని ప్రాణాలు కాపాడింది ఓ  పెట్ డాగ్.  ఏకంగా సింహాలకే ఎదురు నిలిచి తన యజమానిని రక్షించింది. మృగరాజులను సైతం ముప్పతిప్పలు పెట్టింది.  అది ఎక్కడో కాదు గుజరాత్‌లోని అంబార్ది గ్రామంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విశ్వాసానికి మనిషి కన్నా జంతువే మిన్న అని నిరూపించిందని కుక్కను ప్రతి ఒక్కరూ  ప్రశంసిస్తున్నారు. 

గొర్రెల కాపరి భవేశ్‌ హమిర్‌ భర్వాద్...  జులై 21న తన గొర్రెలను సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లాడు.అటవీ  ప్రాంతంలో గొర్రెలు మేత మేస్తుండగా.. సడెన్‌గా మూడు సింహాలు వాటిపై దాడి చేశాయి. ఈ దాడిలో తన  గొర్రెలను  రక్షించుకునేందుకు భవేష్ హామీర్ భర్వాద్ తీవ్ర ప్రయత్నం చేశాడు.  దీంతో ఆగ్రహించిన సింహాలు భర్వాద్‌పై కూడా దాడి చేశాయి. 

ఓనర్‌పై సింహాలు దాడి చేయడాన్ని గమనించిన శునకం... ఒక్కసారిగా సింహాలతో సమరానికి దిగింది.  యజమానికి కాపాడుకునేందుకు గట్టిగా అరుస్తూ సింహాల దగ్గరకు పరుగెత్తుకు వచ్చి బెదిరించే ప్రయత్నం చేసింది. దీంతో కుక్క అరుపులు విన్న స్థానికులు.. అక్కడికి క్షణాల్లో పరుగెత్తుకు వచ్చారు. జన సమూహాన్ని చూసిన సింహాలు.. అక్కడి నుంచి అడవిలోకి  మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాయి. అయితే యజమానికి కాపాడుకునేందుకు కుక్క చేసిన దైర్యాన్ని పలువురు అభినందిస్తున్నారు.

English Title
Gujarat: Dog saves shepherd from 3 lions

MORE FROM AUTHOR

RELATED ARTICLES