నా మీద నమ్మకంతో ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇచ్చారు

Submitted by arun on Mon, 07/23/2018 - 16:42
roja

వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి, జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. చిత్తూరు జిల్లా నగరిలో వ్యాపారులకు తోపుడు బండ్లను ఈరోజు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, జగన్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తన మీద నమ్మకంతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి టిక్కెట్‌ ఇచ్చారని ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. జగన్‌ మోహన్‌ రెడ్డి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నగరి ప్రజలు తనను గెలిపించారని తెలిపారు. నగరి ప్రజల రుణం జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. గత ఎన్నికల్లో చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఏపీలో ప్రతిపక్షం మీద కక్షసాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. 
 

English Title
YSRCP MLA RK Roja Speech at Nagari

MORE FROM AUTHOR

RELATED ARTICLES