‘మా ఇద్దరికీ పెళ్లి చేయమని అడిగాను’: సల్మాన్‌ఖాన్

Submitted by arun on Mon, 07/23/2018 - 14:03

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అన్ని దేశం యావత్తూ ఎదురు చూస్తోంది. ఈ నేపధ్యంలో తాజాగా ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. ఒకప్పుడు సల్మాన్‌ఖాన్ బాలీవుడ్ హీరోయిన్ జూహీచావ్లాను వివాహం చేసుకోవాలనుకున్నారట! ఈ విషయాన్ని సల్మాన్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వివరించారు. బాలీవుడ్‌ మాజీ హీరోయిన్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫ్రాంచైజీ సహ యజమాని జూహి చావ్లా గురించి మాట్లాడిన సల్మాన్‌ పలు ఆసక్తిర విషయాలు వెల్లడించారు. ‘తను చాలా ఆత్మీయత కలిగిన వ్యక్తి. తన వ్యక్తిత్వం నాకెంతగానో నచ్చింది. అందుకే వాళ్ల నాన్న దగ్గరికి వెళ్లి జూహితో నా పెళ్లి జరిపిస్తారా అని అడిగాను. కానీ ఆయన కుదరదంటూ నా ముఖం మీదే చెప్పేశారని’  సల్మాన్‌ వ్యాఖ్యానించాడు. మరి జూహి వాళ్ల నాన్న ఎందుకు అంగీకరించలేదని అడగగా.. ‘తనకి నేను సరిపోనని భావించారేమో’  అంటూ సల్మాన్‌ నవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా సల్మాన్‌ ఖాన్‌, జూహి చావ్లాలు ఒక్క సినిమాలో కూడా కలిసి నటించలేదు.

English Title
Salman Khan asked Juhi Chawla's father for her hand in marriage

MORE FROM AUTHOR

RELATED ARTICLES