లోయలో పడిన బస్సు ; 10 మంది మృతి

Submitted by arun on Thu, 07/19/2018 - 12:14
accident

ఉత్తరాఖండ్‌లోని తిహ్రీ జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న రాష్ట్ర ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు ప్రమాదవశాత్తూ 250 మీటర్ల లోతైన లోయలో పడటంతో 10 మంది మృతి చెందారు. 9 మంది గాయపడ్డారు. ప్రయాణికులతో వస్తున్న బస్సు రిషీకేశ్ గంగోత్రి హైవేపై జారిపడి లోయలోకి దొర్లిపోయింది. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే స్థానిక యంత్రాంగం, పోలీసులు హుటాహుటిన చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. 25 మందితో ప్రయాణం చేస్తున్నబస్సు ఉత్తరకాశీ నుంచి హరిద్వార్‌కు వెళుతోంది. క్షతగాత్రులను రిషికేష్‌లో ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హెలికాఫ్టర్లను కూడా సహాయక కార్యక్రమాలను ఉపయోగించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల నష్టపరిహారం అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

English Title
Uttarakhand: 10 Killed, 9 Injured After Bus Falls Into 250-Metre Gorge

MORE FROM AUTHOR

RELATED ARTICLES