ప్రియాంక విషయంలో పప్పులో కాలేసిన కాంగ్రెస్!

Submitted by arun on Fri, 07/13/2018 - 15:59
priyanka chopra

భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పప్పులో కాలేసింది. పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేదిని ఓ ట్వీట్‌కు జత చేయబోయిన కాంగ్రెస్‌ గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాను ట్యాగ్‌ చేసింది. రైతులకు భూసారంపై నివేదికలు ఇచ్చే భూసార పరీక్షా కేంద్రాలపై మోదీ అబద్ధాలు చెబుతున్నారంటూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ‘‘భూసార పరీక్షా కేంద్రాలపై కూడా మోదీ అబద్ధాలు చెబుతున్నారు. యూపీఏ హయాంలో మొత్తం 1141 భూసార పరీక్షా కేంద్రాలు ఉన్నాయి...’’ అంటూ ప్రియాంక చతుర్వేది బదులు ప్రియాంక చోప్రా చెబుతున్నట్టుగా ట్యాగ్ చేశారు. తీరా ఇది గమనించిన నెటిజన్లు తిట్ల పురాణం మొదలు పెట్టడంతో హడావిడిగా ఈ ట్వీట్‌ను తొలగించారు.

English Title
Congress mistakenly tags Priyanka Chopra instead of its spokesperson, deletes tweet

MORE FROM AUTHOR

RELATED ARTICLES