పవన్ సార్ సారీ.. గుర్తు చేస్తున్నానంతే…:శ్రీరెడ్డి

Submitted by arun on Fri, 07/13/2018 - 12:19
pks

శ్రీరెడ్డి పరిచయం అక్కరలేని పేరు. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేసేందుకు శ్రీశక్తిగా మారుతున్నానంటూ ఆ మధ్య హడావుడి చేసిన శ్రీరెడ్డి.. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనలతో కామ్ అయిపోయింది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గానే ఉంటోంది.  ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో ఆమె పోస్టులు వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్యే హీరో నానీని టార్గెట్ చేసింది. ఇప్పుడు కోలీవుడ్‌పై వరుస పోస్టులు పెడుతోంది. తాజాగా ఆమె మళ్లీ జనసేన అధినేత,నటుడు పవన్ కళ్యాణ్‌పై మరో పోస్టు పెట్టింది. ‘వీరనారి విభాగం గురించి మాట్లాడుతూ.. మీరు ఒక మాట అన్నారు సార్. నేను నా సినిమాల్లో అర్ధనగ్న(ఎక్స్‌పోజింగ్) సీన్స్‌కి అనుమతి ఇవ్వను. మహిళలు అంటే గౌరవం అని… గుర్తు చేద్దామని చిన్న ప్రయత్నం సార్.. సారీ’ అంటూ పవన్ నటించిన కొన్ని సినిమాలలోని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో పవన్‌తో బికినీల్లో వున్న డాన్సర్లు, కురుచ దుస్తుల్లో వున్న హీరోయిన్లు వున్నారు. అయితే ఆమె చేసిన పోస్ట్‌పై నెటిజన్స్ మాత్రం చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు.

English Title
sri reddy comments again on pawankalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES