పవన్ యాత్రను డిసైడ్ చేసిన జగన్.!

Submitted by arun on Thu, 07/12/2018 - 12:03
pkj

ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సాగుతుండగా, అదే జిల్లాలో తన యాత్రను తలపెట్టిన పవన్ ను పోలీసులు వారించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో యాత్రను ముగించుకున్న పవన్ కల్యాణ్, తూర్పు గోదావరి జిల్లాలో యాత్రను ప్రారంభించాలని భావించి పోలీసులకు సమాచారం అందించాడు. జగన్ యాత్ర సాగుతున్నందున పూర్తి భద్రతను అందిచలేమని పోలీసులు స్పష్టం చేయడంతో, తన నిర్ణయాన్ని మార్చుకున్న పవన్, తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్రను తలపెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుందని సమాచారం. ఈ విషయమై జనసేన నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

English Title
jagan decides pawan porata yatra

MORE FROM AUTHOR

RELATED ARTICLES