షకలక శంకర్ పై శ్రీరెడ్డి ఫైర్..పళ్లు రాలగొట్టి చేతిలో పెడతా!

Submitted by arun on Thu, 07/05/2018 - 10:21
sri

టాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి కొద్ది రోజుల నుంచి ఇంటికే పరిమితం అయ్యింది.  ఇంటి నుంచే తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నానని చెబుతున్న శ్రీరెడ్డి సోషల్ మాద్యమాల్లో సంచలన వ్యాఖ్యలు, ట్విట్స్ చేస్తూ వస్తుంది.  తాజాగా కమెడియన్ షకలక శంకర్ పై విరుచుకుపడింది. అతడికి తన స్టైల్ లో వార్నింగ్ కూడా ఇచ్చింది.  ఈ మద్య జబర్ధస్త్ కమెడియన్ షకలక శంకర్ ‘శంభో శంకర’సినిమాలో నటించిన విషయం తెలిసిందే.  ఈ సినిమా  శుక్రవారం రిలీజ్ అయ్యింది.  అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శ్రీ రెడ్డి స్పందిస్తూ.. మీ సినిమా పబ్లిసిటీ కోసం నా పేరు మద్యలో తీసుకొచ్చారంటే పళ్లు రాలగొడతానని తీవ్రంగా విరుచుకుపడ్డారు.

''ఇప్పటివరకు నేను ఎదగడానికి, ఫేమస్ అవ్వడానికి ఎవరి పేరును వాడుకోలేదు. నా ఎదుగుదల కోసం పక్క వారిపై ఆధారపడలేదు. కానీ ఇప్పుడు ఒక హీరో భక్తులు బయలుదేరారు. ఆ హీరోకి తెలుసో తెలియదో గానీ అతడి పేరు చెప్పుకొని అతడు రాజకీయంగా రాణించాలి అంటూ అతడిపై బ్రతికేస్తున్నారు. తన సినిమా పబ్లిసిటీ కోసం అతడి ఫ్యాన్స్ ను కూడా వాడేస్తున్నారు. మీ పబ్లిసిటీ కోసం వేరొకరి పేరుని వాడుకోవడం కరెక్ట్ కాదు.. పైగా నా పేరు మధ్యలో తీసుకొస్తున్నారు. ఇకపై అలా చేస్తే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడతా.. అవకాశాల కోసం రోడ్డున పడలేం కదా అంటూ ఏదేదో వాగుతున్నావనే విషయం నా వరకు వచ్చింది. కమెడియన్ నుండి హీరోగా సినిమా చేశావు. నువ్వేం గొప్పోడివి కాదు.. నీ ప్రొడ్యూసర్ కూడా పెద్ద గొప్పోడు కాదు. మీ కథలు, మీ ప్రొడ్యూసర్ కథలు కూడా బయటకు వస్తాయి. మీ సినిమాల పబ్లిసిటీ కోసం పెద్ద హీరోల పేర్లు తీసుకొచ్చి ప్రచారం చేసుకుంటున్నావ్.. నా పేరు వచ్చిందంటే మాత్రం మర్యాదగా ఉండదు. అప్పుడొకసారి మర్యాద లేకుండా ఏకవచనంతో మాట్లాడావ్.. ప్రతిఒక్కరికీ టైమ్ వస్తాది. వెయిట్ అండ్ సీ'' అంటూ షకలక శంకర్ కు వార్నింగ్ ఇచ్చింది. 

English Title
sri-reddy-fires-shakalaka-shankar

MORE FROM AUTHOR

RELATED ARTICLES