బిగ్ బాస్ హౌస్ నుండి సంజనా ఔట్!

Submitted by arun on Mon, 06/18/2018 - 11:02
sanjana

నాని హోస్ట్ గా బిగ్ బాస్-2 మొదలై వారం అవుతుంది. మొదటి ఎలిమినేషన్ అందరి అంచనాలను మించి జరిగింది. గణేష్, సంజనా, నూతన్ నాయుడులలో సంజనా, నూతన్ నాయుడులను ఎలిమినేటర్స్ గా తేల్చిన బిగ్ బాస్ ఫైనల్ గా నాటకీయ పరిణామాలతో నూతన్ నాయుడుని సేఫ్ చేసి సంజనాని ఎలిమినేట్ చేశారు. బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి సంజన పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ఇతర కంటెస్టెంట్లతో దూకుడుగా వ్యహరించేవారు. ముఖ్యంగా తేజస్వి సంజనాకు  మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా ఉండేది. వారం రోజుల పాటు సంజనా బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉండగా ప్రతిరోజు వివాదాస్పదంగా ఉండేదంటూ ఇంటి సభ్యులు తెలిపారు.

వచ్చిన రోజు నుంచే సంజనా దురుసుగా ప్రవర్తిస్తుండటంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు సంజనాను తొలి వారం ఎలిమినేషన్‌కు నామినేట్ చేశారు. ఓటింగ్‌లో ప్రేక్షకుల నుంచి కూడా ఓట్లు తక్కువగా రావడంతో హౌస్ నుండి బయటకు వచ్చేశారు. వస్తూ వస్తూ బాబు గోగినేని, తేజస్విల మీద విమర్శలు చేశారు. బాబుగోగినేని బయటకి కనిపించేంత మంచి వ్యక్తి కాదని చెప్పింది. అది కేవలం తన అభిప్రాయమేనంటూ తెలిపారు. తేజస్వి పక్క వారితో ఎలా ఉండాలో నేర్చుకోవాలని, అందరిని సమానంగా చూస్తే బాగుంటుందని సూచించారు.

ఎలిమినేట్ అయిన కంటెస్టంట్‌ సంజనకు బిగ్‌బాస్.. బిగ్ బాంబ్ ఒకరిపై ప్రయోగించే అవకాశం ఇవ్వగా, బాబు గోగినేనిపై ప్రయోగించింది. దాని ప్రకారం ఈ వారం మొత్తం ఎవరికి మంచి నీళ్లు కావల్సివచ్చినా, బాబు గోగినేని వారికి అందివ్వాలి.  ఎలిమినేట్‌ అయిన సంజన స్థానంలో ఓ హీరోయిన్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.

English Title
sanjana anne eliminated bigg boss house

MORE FROM AUTHOR

RELATED ARTICLES