జగన్‌ని కలిసిన రమణదీక్షితులు

Submitted by arun on Thu, 06/07/2018 - 17:17
ramana deekshitulu

టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు... వైసీపీ అధినేత జగన్‌ని కలిశారు. జగన్‌తో 20 నిమిషాల పాటు చర్చించారు. తానేమీ రాజకీయాలు చేయడం లేదని, తాను చేసిన ఆరోపణలకు  కట్టుబడి ఉన్నానని అన్నారు. రమణదీక్షితులు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వచ్చి జగన్‌తో ముచ్చటించారు. టీటీడీలో అవినీతి ఉందని, అక్రమాలు, ఆగమశాస్త్ర ఉల్లంఘనలు జరుగుతున్నాయని రమణ దీక్షితులు సంచలన ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే. మరోవైపు జగన్‌ ఈ విషయంపై ఇటీవల స్పందించి.. రమణ దీక్షితులు ప్రశ్నించినందుకు అర్చకులపై కక్ష సాధింపునకు పాల్పడి, వారికి పదవీ విరమణ ప్రకటించడం సరైంది కాదని అన్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య జరిగిన భేటీ చర్చనీయాంశంగా మారింది.     
 

English Title
ramana deekshitulu meet ys jagan

MORE FROM AUTHOR

RELATED ARTICLES