ఫైన‌ల్ మ్యాచ్‌ను ఆమెతో క‌లిసి చూశా: స‌చిన్‌

Submitted by arun on Tue, 05/29/2018 - 15:10
Sachin Tendulkar

ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్‌ను మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ ఓ ప్రముఖురాలితో కలిసి వీక్షించినట్లు ట్విటర్‌ ద్వారా తెలిపాడు. ఇంతకీ ఆమె ఎవరు అనే కదా మీ సందేహం. ఇంకెవరు ఆమే ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌. గ‌త ఆదివారం చెన్నై సూప‌ర్‌కింగ్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్ల మ‌ధ్య ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హైద‌రాబాద్‌ను ఓడించి చెన్నై జ‌ట్టు ట్రోఫీ చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌ను ల‌తా మంగేష్క‌ర్‌తో క‌లిసి చూసిన‌ట్టు స‌చిన్ ట్విట‌ర్ ద్వారా తెలిపాడు. `ల‌తాదీదీతో క‌లిసి ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ వీక్షించా. దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ ఎంతో ప్ర‌త్యేకంగా మారింది` అంటూ స‌చిన్ ట్వీట్ చేశాడు. ల‌త పాట‌లంటే స‌చిన్‌కు ఎంత ఇష్టమ‌నే సంగ‌తి తెలిసిందే. అలాగే స‌చిన్ అంటే ల‌తా మంగేష్క‌ర్‌కు చాలా అభిమానం.

English Title
Sachin Tendulkar Watched T20 Final With Lata Mangeshkar

MORE FROM AUTHOR

RELATED ARTICLES