భార్య చేతిలో దారుణ హత్యకు గురైన భర్త!

Submitted by nanireddy on Sun, 05/27/2018 - 10:13
wife-murdered-husband-chittoor

భార్య చేతిలో దారుణహత్యకు గురైయ్యాడు ఓ వ్యక్తి ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిత్తూరు మండల కేంద్రమైన శాంతిపురంలో శివగణేశన్, మాధవిరాణి నివసిస్తున్నారు వారికీ ఇద్దరు కుమార్తెలు. శివగణేశన్ వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో  శనివారం హఠాత్తుగా భార్యచేతిలో హతమయ్యాడు. భర్తను దారుణంగా హత్య చేసిన మాధవి వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోయింది. గతకొంతకాలంగా దంపతులమధ్య మనస్పర్థలు వచ్చాయని తనకు ఇద్దరూ ఆడపిల్లలే ఉండటం చేత మగపిల్లవాడు కావాలని ఇంకో పెళ్లి చేసుకుంటానని వేధించేవాడని దీంతో తాను విసుగుచెంది భర్తను హత్య చేసినట్టు మాధవి పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే తన భర్తను హత్య చేసినట్టు భార్య ఒప్పుకోవడంతో ఆమెను జైలుకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

English Title
wife-murdered-husband-chittoor

MORE FROM AUTHOR

RELATED ARTICLES