స్టూడెంట్‌తో లేడీ టీచర్‌ రొమాన్స్‌

Submitted by arun on Sat, 05/26/2018 - 12:33
teacher

ఆమె ఓ సైన్స్ టీచర్. ఆమె భర్త ఓ లెక్చరర్, పైగా, ఇద్దరు పిల్లలకు తల్లి. వయసు 35 యేళ్లు. అయినా కామకోర్కెలను నిగ్రహించుకోలేక పోయింది. ఫలితంగా తన వద్దకు ట్యూషన్‌కు వచ్చే టెన్త్ విద్యార్థిని పడకగదిలోకి తీసుకెళ్లి శృంగార పాఠాలు చెప్పసాగింది. పైగా, ఆ విద్యార్థిని ట్యూషన్ మాన్పిస్తే ఆత్మహత్య చేసుకుంటానని యువకుడి తల్లిదండ్రులను బెదిరించింది. బెదిరించడమే కాదు.. అన్నంతపనీ చేసింది. ఈ సంఘటన చండీగఢ్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

చండీగఢ్ సిటీలోని రామ్‌ దర్బార్‌ కాలనీ.. మహిళ వయసు 35 ఏళ్లు.. ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ టీచర్.. ఇద్దరు పిల్లలకు తల్లి కూడా! ఆమె భర్త లెక్చరర్‌. పదోతరగతి కావడంతో ఆ ఏరియాలోని ఓ ఫ్యామిలీ..తమ 14 ఏళ్ల తమ కొడుకుని ఈ టీచర్ వద్దకి ట్యూషన్‌కి పంపారు. మూడునెలలుగా ట్యూషన్‌కు పంపిస్తున్నా తెలివైన యువకుడికి మార్కులు తగ్గడం, చదువుపై ధ్యాస తగ్గిపోవడాన్ని తల్లిదండ్రులు గమనించారు. ఇక ట్యూషన్‌ మానిపించాలని చెప్పడానికి టీచర్ వద్దకి వెళ్లారు. వాళ్లతో గొడవకు దిగిన ఆ టీచర్, వెంటనే స్టూడెంట్‌ని గదిలో పెట్టి బంధించింది. చివరకు ఇరుగుపొరుగు వాళ్లు వచ్చి యువకుడ్ని విడిపించి ఇంటికి పంపారు. సీన్ కట్ చేస్తే… టీచర్‌ కూడా స్టూడెంట్‌తో ఇంటికి వెళ్లింది. బాత్‌రూమ్‌లోకి వెళ్లి స్టూడెంట్‌ని ట్యూషన్‌కి పంపకుంటే.. తానే విషం తాగి ఆత్మహత్య చేసుకుంటానంటూ ఓ సీసాలోని మందు తాగేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆమెని వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. ఈ వ్యవహారంపై స్టూడెంట్ పేరెంట్స్ ‘చైల్డ్‌లైన్‌’కి ఫిర్యాదు చేశారు. వాళ్లొచ్చిన ఆరా తీయగా అసలు విషయం బయటకువచ్చింది. ఆ టీచర్ తనను లైంగికంగా వేధించేదంటూ పైగ జరిగిన విషయాలను బయటపెట్టాడు ఆ బాధితుడు. చివరకు టీచర్ తాగింది.. దగ్గు మందు అని డాక్టర్లు నిర్థారించారు. పోక్సో చట్టం కింద ఆమెని అరెస్ట్ చేశారు పోలీసులు. న్యాయస్థానం ఆదేశాలతో ఆమెని జ్యుడీషియల్‌ రిమాండుకు తరలించారు.

English Title
woman teacher held for sexually abusing boy

MORE FROM AUTHOR

RELATED ARTICLES