డ్యాన్స్ చేయలేదని సింగర్‌ను కాల్చి చంపేశాడు!

Submitted by arun on Thu, 04/12/2018 - 13:03
singer

ఓ వెడ్డింగ్ పార్టీలో డ్యాన్స్ చేయకుండా పాట పాడుతోందని సింగర్‌ని కాల్చిచంపారు ఓ వ్యక్తి. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో జరిగింది. 24 ఏళ్ల సమినాసింధు అనే సింగర్.. పెళ్లి విందులో పాటలు పాడింది. ఐతే, ఆమె గర్భిణి కావడంతో కేవలం పాటలు మాత్రమే పాడింది. గర్భవతి అయిన గాయని సమీనా కూర్చొని పాటలు పాడుతుండగా తారిఖ్ అహ్మద్ జతోయ్ అనే వ్యక్తి ఆమెను డ్యాన్స్ చేస్తు పాడాలని కోరాడు. తారిఖ్ అహ్మద్ మాట వినలేదనే కోపంతో గాయని సమీనాను తారిఖ్ అహ్మద్ కాల్చి చంపాడు. తీవ్రంగా గాయపడిన సమీనాను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ప్రకటించారు. తన భార్యతో పాటు ఆమె గర్భంలో ఉన్న శిశువును కూడా హతమార్చిన నిందితుడిపై జంట హత్యల కేసు నమోదు చేయాలని సమీనా భర్త డిమాండ్ చేశారు. సమీనా హత్య వీడియో క్లిప్ ను మానవహక్కుల సంఘం ప్రతినిధి కపిల్ దేవ్ ట్విట్టర్‌లో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది.

English Title
Man shoots pregnant singer for refusing to dance at Larkana event

MORE FROM AUTHOR

RELATED ARTICLES